News September 12, 2025
KMM: సాయిరాం ఆసుపత్రిపై తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాం: డా.సునీల్

సాయిరాం ఆస్పత్రిపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నామని డా.జంగాల సునీల్ కుమార్ అన్నారు. శుక్రవారం ఖమ్మంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ఇటీవల తమ ఆసుపత్రిలో 13 ఏళ్ల బాలుడు కాలేయం క్షీణత వ్యాధి సమస్యతో ప్రాణాపాయస్థితిలో చేరాడని చెప్పారు. ముందుగా బాలుడికి పసర నాటువైద్యం వాడడంతో మూత్రపిండాల వైఫల్యమైందని, చివరి ప్రయత్నంగా తమ ఆసుపత్రికి తీసుకొచ్చారని స్పష్టం చేశారు.
Similar News
News September 13, 2025
పెన్‌పహాడ్: బ్యాంకు ఉద్యోగికి బదిలీ వీడ్కోలు సన్మానం

పెన్‌పహాడ్‌లోని తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకులో క్యాషియర్‌గా సేవలందించి బదిలీపై వెళ్తున్న బ్యాంకు ఉద్యోగి బి.ప్రశాంత్‌ను బ్యాంకు మేనేజర్ ప్రమోద్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ప్రశాంత్ మండల ప్రజలకు ఉత్తమ సేవలందించి మంచి పేరు తెచ్చుకున్నారని బ్యాంకు మేనేజర్ ప్రమోద్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ సేవలందించిన ప్రజల మన్ననలు పొందాలన్నారు.
News September 13, 2025
పెద్దపల్లి: జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష

ఇందిరమ్మ ఇళ్లు, జీపీ బిల్డింగ్స్ అమలుపై అధికారులతో కలెక్టరేట్‌లో కలెక్టర్ కోయశ్రీ హర్ష సమావేశం నిర్వహించారు. 100 శాతం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లు గ్రౌండింగ్ పూర్తి చేయాలన్నారు. పనులు త్వరితగతిన జరగడానికి పర్యవేక్షణ అవసరమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల వివరాలు పోర్టల్‌లో నమోదు చేసి నిధులు విడుదల చేయించాలన్నారు. NREGS నిధులతో మంజూరైన గ్రామ పంచాయతీ కార్యాలయాల నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు.
News September 13, 2025
HNK: ఈనెల 14న ఎన్డీఏ & సీడీఎస్ పరీక్ష

ఈనెల 14న నిర్వహించనున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ), కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీ సర్వీసెస్(సీడీఎస్) పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి వై.వి.గణేశ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలో ఏర్పాటు చేసిన పలు పరీక్షా కేంద్రాల్లో ఎన్డీఏ, సీడీఎస్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.