News February 6, 2025
KMM: 1,04,995 మందికి రైతు భరోసా నిధులు జమ

తెలంగాణ ప్రభుత్వం యాసంగి సాకు కింద రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మండలాలు, గ్రామాల వారీగా ఒక ఎకరం వరకు సాగులో ఉన్న రైతుల ఖాతాలో నగదు జమ చేసింది. ఖమ్మం జిల్లాలో ఎకరంలోపు భూమి ఉన్న 1,04,995 మంది రైతుల ఖాతాలలో రూ.58,22,56,809 జమయ్యాయి. గతంలో రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున అందిస్తుండగా, ప్రస్తుతం రూ.6 వేలకు పెంచిన విషయం తెలిసిందే.
Similar News
News October 15, 2025
ఆ నాలుగు మండలాల్లోనే వర్షపాతం నమోదు.!

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం 8:30 వరకు గడిచిన 24 గంటల్లో 9.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. కూసుమంచి మండలంలో 4.8, తల్లాడ మండలంలో 2.4, రఘునాథపాలెం మండలంలో 1.4, ఖమ్మం రూరల్ మండలంలో 1.0 మిల్లీమీటర్లు నమోదైనట్లు చెప్పారు. కాగా ఇతర మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదని పేర్కొన్నారు.
News October 15, 2025
ఖమ్మం: 82 మంది పోలీసులకు సేవా పతకాలు ప్రదానం

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో విశిష్ట సేవలందించిన 82 మంది పోలీస్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సేవా పతకాలను కమిషనర్ సునీల్ దత్ మంగళవారం అందజేశారు. మహోన్నత సేవ పతకం ఒకటి, ఉత్తమ సేవ ఐదు, సేవా పతకాలు 64, ఉత్కృష్ట పతకాలు 12 మందికి లభించాయి. అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు, ఏసీపీలు రమణమూర్తి, సాంబరాజు తదితరులు పతకాలు అందుకున్నారు.
News October 14, 2025
ఆన్లైన్ మోసం.. రూ.30 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాడు అరెస్ట్

పార్ట్టైమ్ జాబ్, పెట్టుబడుల పేరుతో రూ.30 లక్షలు మోసం చేసిన సైబర్ నేరస్థుడిని ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వేంసూరుకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి టెలిగ్రామ్లో పరిచయం అయ్యాడు. పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని అశ చూపి రూ. 30 లక్షలు ఇన్వెస్ట్ చేయించి మోసగించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీ నగర్లో ఉన్న నిందితుడిని పట్టుకొని రిమాండ్ చేశారు.