News February 6, 2025
KMM: 1,04,995 మందికి రైతు భరోసా నిధులు జమ
తెలంగాణ ప్రభుత్వం యాసంగి సాకు కింద రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మండలాలు, గ్రామాల వారీగా ఒక ఎకరం వరకు సాగులో ఉన్న రైతుల ఖాతాలో నగదు జమ చేసింది. ఖమ్మం జిల్లాలో ఎకరంలోపు భూమి ఉన్న 1,04,995 మంది రైతుల ఖాతాలలో రూ.58,22,56,809 జమయ్యాయి. గతంలో రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున అందిస్తుండగా, ప్రస్తుతం రూ.6 వేలకు పెంచిన విషయం తెలిసిందే.
Similar News
News February 6, 2025
రామయ్య హుండీ ఆదాయం రూ.1,13,23,178
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని 37 రోజుల తర్వాత గురువారం లెక్కించగా రూ.1,13,23,178 లు వచ్చినట్లు ఈవో రమాదేవి తెలిపారు. అంతేకాకుండా 109 గ్రాముల బంగారం, 895 గ్రాముల వెండి, 298 యూఎస్ డాలర్లు, 155 సింగపూర్ డాలర్లు, 430 యూఏఈ దీరమ్స్, 20 కెనడా డాలర్లు, 85 ఆస్ట్రేలియా డాలర్లు, 45 యూరప్ యూరోస్ కూడా భక్తులు సమర్పించినట్లు పేర్కొన్నారు.
News February 6, 2025
వరుస ప్రశంసలతో దూసుకెళ్తున్న ఖమ్మం కలెక్టర్
ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తన పనితీరు, వ్యక్తిత్వంతో వరుస ప్రశంసలు అందుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం గురుకు పాఠశాలను సందర్శించి విద్యార్థులతో పాటు నేలపై కూర్చొని సూచనలు ఇచ్చారు. తరువాత రైతు అవతారం ఎత్తి పొలాల బాట పట్టి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. తాజాగా ఖమ్మం ఎన్నెస్పీ ప్రభుత్వ స్కూల్ సందర్శించి విద్యార్థులతో పాటు నేలపై కూర్చొన్ని మోటివేషన్ క్లాసులు విన్నారు.
News February 6, 2025
మణుగూరు అటవీ ప్రాంతంలో పెద్దపులి.. పేరు ఇదే..!
మణుగూరు అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పులి మూడేళ్లుగా జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కానీ కొద్దిరోజులే జిల్లా దాటుతోంది. దీంతో 2 నెలల క్రితం వచ్చిన పులి తిరిగి వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. రెండు నెలలుగా పులి జిల్లా దాటకపోవడంతో మగ పులిగా నిర్ధారించి ‘భద్ర’ అని నామకరణం చేశామని డీఎఫ్‌ఓ కృష్ణాగౌడ్ తెలిపారు. ఈనెల 2న కెమెరాకు చిక్కిందన్నారు.