News February 17, 2025
KMM: 19 మందిలో ఒక్కరే మహిళా అభ్యర్థి

వరంగల్ -ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన 19 మంది అభ్యర్థులలో కేవలం ఒక్కరే మహిళా అభ్యర్థి ఉన్నారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన అర్వ స్వాతి బరిలో నిలిచిన అతి చిన్న వయస్కురాలిగా (34 ఏళ్లు) ఉన్నారు. 68 ఏళ్ల వయసుతో హనుమకొండ జిల్లా దామరకు చెందిన దామర బాబురావు పెద్ద వయస్కుడిగా బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 27 తేదీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.
Similar News
News December 4, 2025
ఖమ్మం: మొదటి విడతలో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలు ఇవే..!

ఖమ్మం జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీల వివరాలను అధికారులు వెల్లడించారు. బోనకల్(M)- కలకోట, చింతకాని(M)- రాఘవాపురం, రేపల్లెవాడ, మధిర(M)- సిద్దినేనిగూడెం, సైదల్లిపురం, వైరా(M)- లక్ష్మీపురం, గోవిందాపురం, నారపునేనిపల్లి, రఘునాథపాలెం(M)- మల్లేపల్లి, రేగులచలక, మంగ్యాతండా, రాములుతండా, ఎర్రుపాలెం(M)- గోసవీడు, చొప్పకట్లపాలెం, జమలాపురం, కండ్రిక, గట్ల గౌరారం, కాచవరం.
News December 4, 2025
ఎంపీడీఓ కార్యాలయాల వద్ద ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు: కలెక్టర్

పంచాయతీ ఎన్నికల సందర్భంగా మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల వద్ద ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అత్యవసర సేవల్లో పనిచేసే ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.