News November 28, 2025

KMM: ‘BRSతో CPM పొత్తు..!’

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు చోట్ల BRS బలపర్చిన అభ్యర్థులకు CPM నేతలు మద్దతు తెలుపుతున్నారు. శుక్రవారం ముదిగొండలో BRS, CPM మండల స్థాయి ఎన్నికల సమావేశాన్ని CPM మండల కార్యదర్శి పురుషోత్తం, BRS మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి నిర్వహించి స్థానికంగా తమ పార్టీలు పొత్తులో ఉన్నట్లు ప్రకటించారు. మరోవైపు భద్రాచలంలో BRS బలపర్చిన సర్పంచ్ అభ్యర్థికి CPM నేతలు మద్దతు తెలిపారు.

Similar News

News November 28, 2025

నిర్మల్ : రేపటి నుంచి దివ్యాంగుల క్రీడా పోటీలు

image

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నవంబర్ 29 (శనివారం) నుంచి దివ్యాంగుల జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రన్నింగ్, షాట్‌పుట్, జావెలిన్ త్రో, చెస్, క్యారమ్స్ వంటి పోటీల్లో జూనియర్, సీనియర్ విభాగాల వారు పాల్గొనవచ్చన్నారు. విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవుతారని ఆయన వివరించారు.

News November 28, 2025

శ్రీకాకుళం జిల్లా రైతులకు తీపి కబురు: మంత్రి అచ్చెన్నాయుడు

image

శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి కూటమి ప్రభుత్వం తీపికబురు అందించిందని రాష్ట్రవ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వంశధార రిజర్వాయర్లో మరో 12 టీఎంసీలు నీరు నింపేందుకు ప్రక్రియ చేపడుతున్నట్లు వెల్లడించారు. శుక్రవారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వం పనులు చేపట్టినా నిధులు విడుదల చేయలేదన్నారు.

News November 28, 2025

ఖేలో ఇండియా క్రీడల్లో ANU విద్యార్థికి మూడో స్థానం

image

రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడా పోటీలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) విద్యార్థి ఎం. అశోక్ కుమార్ శుక్రవారం మూడో స్థానం సాధించారు. వెయిట్‌ లిఫ్టింగ్ 94 కేజీల కేటగిరీలో ఆయన కాంస్యం గెలుచుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్‌ను వర్సిటీ వీసీ గంగాధరరావు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.