News November 30, 2024
KMM: BRS వాళ్ల లాగా గాలి మాటలు మేం చెప్పం: భట్టి

వివిధ కారణాలవల్ల రుణమాఫీ కానీ రైతుల ఇంటి వద్దకే వెళ్లి వారి సమస్యలు పరిష్కరించి రుణమాఫీ చేసి తీరుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు మహబూబ్‌నగర్ ‘రైతు పండుగ’ సభలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకుల మాదిరి తాము గాలి మాటలు చెప్పేటోళ్లం కాదని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి తీరుతామని ఆయన అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రుణమాఫీ సక్రమంగా జరిగిందా అంటూ ప్రశ్నించారు.
Similar News
News October 28, 2025
నేర నియంత్రణలో సాంకేతికత కీలకం: ఖమ్మం సీపీ

ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో సిటీ ఆర్ముడ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆన్లైన్ “ఓపెన్ హౌస్” మంగళవారం నిర్వహించారు. పోలీసులు వినియోగించే ఆధునిక సాంకేతిక పద్ధతులు, ఫింగర్‌ప్రింట్ యూనిట్, బాంబ్ డిస్పోజల్, సైబర్ నేరాలను పసిగట్టే విధానాలు విద్యార్థులకు చూపించారు. డాగ్ స్క్వాడ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సీపీ మాట్లాడుతూ.. సాంకేతికతతోనే నేర నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
News October 28, 2025
తుఫాన్లలోనూ ఆగని విద్యుత్.. భూగర్భ కేబుల్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన

మధిర పట్టణంలో విద్యుత్ రంగాన్ని ఆధునీకరించేందుకు రూ.27.76 కోట్ల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ విద్యుత్ కేబుల్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం శంకుస్థాపన చేశారు. భారీ వర్షాలు, తుఫాన్ల సమయంలో కూడా విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేయడమే లక్ష్యమన్నారు. మొత్తం 3.5 కి.మీ 33 కేవీ, 17.3 కి.మీ 11 కేవీ, 15 కి.మీ ఎల్టీ లైన్లను భూగర్భంలో వేయనున్నట్లు తెలిపారు.
News October 28, 2025
రాయపట్నంలో సబ్‌స్టేషన్‌కు Dy.CM భట్టి శంకుస్థాపన

మధిర మండలం రాయపట్నం గ్రామంలో 33/11 కేవీ నూతన విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా, వోల్టేజీ సమస్యల పరిష్కారం, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి సేవలు అందించడానికి ఈ ఉపకేంద్రం దోహదపడుతుందని తెలిపారు.


