News February 3, 2025

KMM: ‘BRS నేతలు పింక్ డైరీలో పేర్లు రాయండి’

image

బీఆర్ఎస్ నేతల చేతుల్లో ఎప్పుడూ పింక్ డైరీ ఉండాలని, నిత్యం సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించి, మాట్లాడారు. కార్యకర్తలపై కొందరు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, సమస్యలతో పాటు ఇబ్బందులు పెట్టేవారి పేర్లను రాయాలని, వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పారు.

Similar News

News February 3, 2025

అందరి చూపు త్రిషపైనే..!

image

భారత్ అండర్-19 టీ20 వరల్డ్ కప్ గెలవడంలో భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిష కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 309 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచారు. బౌలింగ్‌లోనూ రాణించి 7 వికెట్లు తీశారు. ఇటీవల ఆసియా కప్ గెలవడంలోనూ ఈమె కీలక పాత్ర పోషించారు. దీంతో అందరి చూపు ఈ భద్రాచలం అమ్మాయిపైనే ఉంది. ఇలానే ఆడితే సినియర్ జట్టుకు ఎంపిక కావడం ఖాయమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News February 3, 2025

బాలిక ఇంటి ఎదుట యువకుడి హల్చల్ 

image

పెనుబల్లి మండల కేంద్రంలో మహేందర్ సాయి అనే యువకుడు మద్యం, గంజాయి మత్తులో వీరంగం సృష్టించాడు. స్థానికుల వివరాలు… తనను ప్రేమించాలంటూ ఓ మైనర్ బాలిక ఇంటి ఎదుట హల్చల్ చేశాడు. కాసేపటి తరువాత స్థానికులను దూషించగా వారు దాడి చేయడంతో గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కొంతకాలంగా మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.

News February 3, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన
∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు
∆} నేలకొండపల్లిలో భక్త రామదాసు జయంతి వేడుకలు
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన