News February 3, 2025
KMM: ‘BRS నేతలు పింక్ డైరీలో పేర్లు రాయండి’
బీఆర్ఎస్ నేతల చేతుల్లో ఎప్పుడూ పింక్ డైరీ ఉండాలని, నిత్యం సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించి, మాట్లాడారు. కార్యకర్తలపై కొందరు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, సమస్యలతో పాటు ఇబ్బందులు పెట్టేవారి పేర్లను రాయాలని, వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పారు.
Similar News
News February 3, 2025
ఖమ్మం: స్వల్పంగా పెరిగిన కొత్త మిర్చి ధర
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా కొత్త మిర్చి ధర రూ.14,200 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,150 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత శుక్రవారంతో పోలిస్తే ఈరోజు కొత్త మిర్చి ధర రూ.200 పెరగగా, పత్తి మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్థులు తెలిపారు. మార్కెట్ లో రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలన్నారు.
News February 3, 2025
అందరి చూపు త్రిషపైనే..!
భారత్ అండర్-19 టీ20 వరల్డ్ కప్ గెలవడంలో భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిష కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 309 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచారు. బౌలింగ్‌లోనూ రాణించి 7 వికెట్లు తీశారు. ఇటీవల ఆసియా కప్ గెలవడంలోనూ ఈమె కీలక పాత్ర పోషించారు. దీంతో అందరి చూపు ఈ భద్రాచలం అమ్మాయిపైనే ఉంది. ఇలానే ఆడితే సినియర్ జట్టుకు ఎంపిక కావడం ఖాయమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
News February 3, 2025
బాలిక ఇంటి ఎదుట యువకుడి హల్చల్
పెనుబల్లి మండల కేంద్రంలో మహేందర్ సాయి అనే యువకుడు మద్యం, గంజాయి మత్తులో వీరంగం సృష్టించాడు. స్థానికుల వివరాలు… తనను ప్రేమించాలంటూ ఓ మైనర్ బాలిక ఇంటి ఎదుట హల్చల్ చేశాడు. కాసేపటి తరువాత స్థానికులను దూషించగా వారు దాడి చేయడంతో గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కొంతకాలంగా మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.