News December 25, 2025
KMM: JAN 3న బర్త్ డే.. అంతలోనే తీవ్ర విషాదం

ఖమ్మంలో <<18659184>>ఈతకు <<>>వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతైన ఘటన తెలిసిందే. సుల్తాన్‌నగర్‌కు చెందిన అబ్దుల్ సుహాన్, శశాంక్, ఈశ్వర్ ఈతకు వెళ్లారు. ముగ్గురు నీటిలో దిగగా.. ఈశ్వర్ మునిగిపోతుండటంతో ఒడ్డుకు చేర్చారు. అనంతరం వారు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. JAN 3న సుహాన్ బర్త్ డే. అందుకోసం కొన్న బట్టలను మార్చురీలో ఉన్న తమ కుమారుడి మృతదేహానికి తొడిగి పెరేంట్స్ విలపించిన తీరు పలువురిని కన్నీరు పెట్టించింది.
Similar News
News December 25, 2025
కామారెడ్డి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు

కామారెడ్డి జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. గడిచిన 24 గంటల్లో గాంధారి మండలంలో అత్యల్పంగా 9.4 డిగ్రీలు నమోదు కాగా, జుక్కల్‌లో 9.6, మద్నూర్‌లో 9.7, డోంగ్లి, మాచారెడ్డిల్లో 9.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల్లో 10 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. పెరుగుతున్న చలి దృష్ట్యా వృద్ధులు, చిన్నారుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
News December 25, 2025
కోలుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం <<18656274>>జ్వరంతో<<>> బాధపడుతూ పులివెందులలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసింది. గురువారం కోలుకొని క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు. పులివెందులలోని స్థానిక సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకలలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు.
News December 25, 2025
TU: విద్యార్థులకు గమనిక

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో జనవరిలో జరగనున్న పీజీ, 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు సంబంధించిన III,V) సెమిస్టర్‌తో పాటు IMBA,III,V,IX) సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫీజు తేదీలను వర్సిటీ అధికారులు విడుదల చేశారు. జనవరి 5వ తేదీలోగా ఎలాంటి అపరాధ రుసుము లేకుండా అదేవిధంగా రూ.100 అపరాధ రుసుముతో 7లోగా ఫీజు చెల్లించవచ్చని పరీక్షల నియంత్రణ అధికారి ప్రొ. కే.సంపత్ కుమార్ తెలిపారు.


