News June 7, 2024
KMM-NLG-WGL: గెలుపు కోసం 1,55,095 ఓట్లు..!

రెండు రోజులుగా కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుపై ఉత్కంఠ నెలకొంది. KMM-NLG-WGL ఉపఎన్నిక కౌంటింగ్‌లో ఎవరికి గెలుపునకు సరిపడా ఓట్లు రాలేదు. గెలుపు కోసం 1,55,095 ఓట్లు రావాల్సి ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు 1,22,813 ఓట్లు, BRS అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 1,04,246 ఓట్లు, BJP అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 43,313 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 29,697 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి.
Similar News
News November 21, 2025
NLG: డబుల్ లబ్ధిదారుల్లో.. 46 మంది అనర్హులు..!

నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో 46 మంది లబ్ధిదారులను అధికారులు అనర్హులుగా గుర్తించారు. వారి స్థానంలో ‘ప్రజా పాలన’ దరఖాస్తుల ద్వారా అర్హులైన వారిని పారదర్శకంగా డ్రా ద్వారా ఎంపిక చేశారు. మొత్తం 552 మంది లబ్ధిదారులకు త్వరలో ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు ఆర్డీవో అశోక్ రెడ్డి, హౌసింగ్ పీడీ రాజ్ కుమార్ తెలిపారు.
News November 21, 2025
ఖనిజ రవాణా వాహనాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

నల్గొండ జిల్లాలో కంకర, ఇసుక, ఇటుక వంటి ఖనిజాలను రవాణా చేసే వాహనాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మైన్స్ ఏడీ సామ్యేల్ జాకాబ్ స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ లేకుండా ఖనిజాలను సరఫరా చేస్తే జరిమానాలతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్ ఆధ్వర్యంలోని డీఎల్ఎస్ కమిటీ నిర్ణయం మేరకు, వినియోగదారులకు ఇసుక సరసమైన ధరలకే అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
News November 21, 2025
NLG: కొత్త రూల్స్ అమలు.. దరఖాస్తులు షురూ

కంకర మిల్లులకు ప్రభుత్వం తాజాగా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఓవర్ లోడ్‌తో వెళ్లే వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున సమూల మార్పులకు ప్రభుత్వం కసరత్తు చేసింది. అందులో భాగంగానే క్రషర్ మిల్లులకు, ఖనిజాన్ని సరఫరా చేసే వాహనాల విషయంలో కొత్త రూల్స్ అమలు చేసింది. దీంతో జిల్లాలో 20 క్రషర్ మిల్లుల యజమానులు, 150 టిప్పర్ల యజమానులు కూడా తిరిగి రిజిస్ట్రేషన్ కోసం మైనింగ్ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నారు.


