News June 7, 2024
KMM-NLG-WGL: 25,854 చెల్లని ఓట్లు

KMM-NLG-WGL పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో భారీగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 3,36,013 పోలవగా అందులో చెల్లని ఓట్లు 25,854 ఉండటం విశేషం. మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీపడగా చెల్లని ఓట్ల సంఖ్య 5వ స్థానంలో నిలిచింది. డిగ్రీలు చదివిన ఓటర్లు ఇలా ఓటును దుర్వినియోగం చేయడం ఏంటని పలువురు విమర్శిస్తున్నారు.
Similar News
News October 30, 2025
కార్తీక దీపాలంకరణలో ధర్వేశిపురం ఎల్లమ్మ దర్శనం

కనగల్ మండలంలోని ధర్వేశిపురంలో వెలసిన స్వయంభు శ్రీ ఎల్లమ్మ అమ్మవారు కార్తీక గురువారం సాయంత్రం సందర్భంగా భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. ఆలయంలో చేసిన దీపాలంకరణతో భక్తి వాతావరణం అలముకుంది. ఆలయ అర్చకుడు నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం స్థానికులు, భక్తులు భారీగా తరలివచ్చారు.
News October 30, 2025
తుఫాను.. అధికారులకు సెలవులు రద్దు: నల్గొండ కలెక్టర్

మొంథా తుఫాను నేపథ్యంలో జిల్లా అధికారులకు సెలవులు రద్దు చేస్తూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం ఆమె ఈ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి సిబ్బంది అనుమతి లేకుండా సెలవుపై వెళ్లవద్దని, విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
News October 30, 2025
నల్గొండ: తుఫాను.. సహాయక చర్యలపై సీఎం వీసీ

మొంథా తుఫాను ప్రభావం, సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో నల్గొండ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. తుఫాను దృష్ట్యా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 27 నుంచే 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.


