News March 18, 2024

KMM: అడుగంటుతున్న పాలేరు జలాశయం!

image

పాలేరు జలాశయం వేసవి ప్రారంభంలోనే అడుగంటుతోంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఉన్న ఈ జలాశయం.. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట జిల్లాలకు తాగునీటి ఆదరువు. ఎండలు తీవ్రమైతే దీనిపై ఆధారపడిన ఈ జిల్లాల ప్రజలకు తాగునీటి కష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం నిల్వ ఉన్న నీళ్లు కూడా మార్చి నెలలో పూర్తిస్థాయిలో అందించలేని పరిస్థితులున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Similar News

News July 1, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారులు సోమవారం ఉదయం వెల్లడించారు. ఏసీ మిర్చి ధర రూ.20,000 జండా పాట పలుకగా పత్తి రూ.7,300 జెండా పాట పలికినట్లు వెల్లడించారు. పత్తి ధర మొన్నటి కంటే 50 రూపాయలు పెరగగా ఏసీ మిర్చి ధర నిలకడగా కొనసాగుతోంది. పత్తికి రేటు పెరుగుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News July 1, 2024

రోడ్డుప్రమాదం, డీఏఓ పరీక్షలకు దూరమైన అభ్యర్థులు

image

సత్తుపల్లిలోని డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ పరీక్ష రాసేందుకు దాదాపు 20 మంది అభ్యర్థులు బస్సులో వెళ్తుండగా ప్రమాదం జరగడంతో కొందరు గాయాలపాలయ్యారు. చికిత్స కోసం వారిని పీహెచ్సీకి తరలించగా పరీక్ష సమయం దాటిపోవడంతో పలువురు అభ్యర్థులు పరీక్షకు దూరం అయ్యారు. మరి కొందరిరి గాయాలైనా పరీక్షా కేంద్రాలకు వెళ్లారు. 3 సంవత్సరాలుగా పరీక్షలకి ప్రిపేర్ అయ్యామని మధ్యలో ఇలా జరిగిందని వారు వాపోతున్నారు.

News July 1, 2024

ఖమ్మం: చింత చిగురు కోస్తుండగా పాము కాటు, మహిళ మృతి

image

కుమార్తెను చూసేందుకు వచ్చిన తల్లి
పాముకాటుతో మృతిచెందిన ఘటన నేలకొండపల్లి మండలంలో ఆదివారం జరిగింది. చింతకాని మండలం నేరడకు చెందిన కోట ఆదెమ్మ(56) శనివారం నేలకొండపల్లి మండలం సదాశివపురంలో ఉంటున్న తన కూతురు గోవిందమ్మ ఇంటికి వచ్చింది. మధ్యాహ్నం చింతచిగురు కోస్తుండగా ఆదెమ్మ కాలిపై పాము కాటు వేసింది. ఆమెను ఖమ్మం తరలించే క్రమంలో పరిస్థితి విషమించి మృతి చెందింది.