News March 17, 2024
KMM: సెల్ఫోన్లు తీసుకెళ్తే సస్పెన్షనే..!!

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో సెల్ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. రేపటి నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ సమయంలో పరీక్షకేంద్రాలను ‘నో సెల్ఫోన్’ జోన్లుగా ప్రకటించారు. పరీక్ష సిబ్బంది, స్క్వాడ్ సహా ఇతర అధికారులందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఇక తనిఖీలకు వచ్చే అధికారులు, కలెక్టర్లు, పోలీస్, విద్యాశాఖ ఉన్నతాధికారులు సెంటర్లల్లోకి సెల్ఫోన్లు తీసుకెళ్లడాన్ని అనుమతించరు.
Similar News
News March 1, 2026
ఖమ్మం: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు..

ఖమ్మం జిల్లాలో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో అర్హులైన పేదలు ఇబ్బందులు పడుతున్నారు. కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రులు చెబుతున్నా, ఆచరణలో మాత్రం దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. కొత్తకార్డులతో పాటు, కుటుంబ సభ్యుల పేర్ల చేర్పుల కోసం నెలల తరబడి వేచి చూస్తున్నామని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా మంత్రులు స్పందించి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని కోరుతున్నారు.
News March 1, 2026
రూ.5 లక్షలకు జిల్లా కోర్టులో ఐపీ దాఖలు

ఖమ్మం రూరల్ మండలం MVపాలెంకు చెందిన బొందల రాజశేఖర్- కళ్యాణి దంపతులు జిల్లా కోర్టులో రూ.5 లక్షలకు ఐపీ దాఖలు చేశారు. కాగా వీరు కొంతమంది రుణదాతల వద్ద అవసరాల నిమిత్తం రూ.5 లక్షలు అప్పుతీసుకొని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాటిని చెల్లించడం కష్టమైంది. దీంతో దంపతులు తమను దివాళా దారులుగా ప్రకటించాలని జిల్లా కోర్టులో తమ న్యాయవాది ద్వారా ఐపీ దాఖలు చేశారు.
News March 1, 2026
ఖమ్మం: కుక్కకాటుపై ఆందోళన వద్దు: డీఎంహెచ్ఓ

ఖమ్మం జిల్లాలో కుక్కకాటు ఘటనల నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రామారావు స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా టీకాలు, మందులు అందుబాటులో ఉన్నాయని భరోసా ఇచ్చారు. ముజుగూడెం బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని, ఒకరిని ఖమ్మం ప్రధాన ఆస్పత్రికి తరలించామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సమీప ఆస్పత్రిని సంప్రదించాలని సూచించారు.


