News March 16, 2025

KMM: అనుమానంతో భార్యను, మరొకరిని నరికిన భర్త

image

వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారనే అనుమానంతో భార్యతో పాటు మరొకరిని భర్త కొడవలితో నరికిన ఘటన ఖమ్మం పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. ఇద్దరిపై వేటకొడవలితో దాడి చేయగా వారి పరిస్థితి విషమంగా ఉంది. భర్త పరారీలో ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

Similar News

News March 16, 2025

సిద్దిపేట: ప్రతి ఉపాధ్యాయునికి అందుబాటులో ఉంటా: MLC

image

ప్రతి ఉపాధ్యాయునికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అన్నారు. ఇటీవలే నూతనంగా గెలిచిన ఎమ్మెల్సీని తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి నవాజ్, సురేశ్ ఆధ్వర్యంలో పలువురు టీచర్లు ఆదివారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొమురయ్య మాట్లాడుతూ.. విజయానికి కృషి చేసిన తపస్ సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. అందరికీ అండగా ఉంటానన్నారు.

News March 16, 2025

VZM: అక్రమంగా ఆస్తులు సంపాదిస్తే అటాచ్ చేస్తాం: SP

image

గంజాయి ద్వారా అక్రమంగా ఆస్తులు సంపాదిస్తే అటాచ్ చేస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. గంజాయి విక్రయాలు, అక్రమ రవాణా చేపట్టినా, వినియోగించినా నేరమేనన్నారు. గత సంవత్సరంలో అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై 62 కేసులు నమోదు చేశామన్నారు. జిల్లాలో 1656.990 లక్షల కిలోల గంజాయి, 70 గ్రాముల నల్లమందు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 25 కేసులు నమోదు చేశామన్నారు.

News March 16, 2025

నాన్ వెజ్ ఎవరు తినకూడదంటే?

image

కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. కానీ అందరికీ మాంసాహారం సరిపడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భిణులు ఎక్కువగా నాన్ వెజ్ తినకూడదు. ఇందులో ఉండే కొవ్వు, కొలెస్ట్రాల్ వీరికి హానికరం. గుండె జబ్బులు, షుగర్ ఉన్నవారు కూడా ఇది తినకపోవడమే బెటర్. ఇందులో ఉండే సోడియం రక్తపోటును పెంచుతుంది. అలర్జీ, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం ఉన్నవారు నాన్ వెజ్ తింటే జీర్ణ సమస్యలు వస్తాయని అంటున్నారు.

error: Content is protected !!