News April 25, 2024
KMM: ఏజెన్సీ ప్రాంతంలో 88 మంది అరెస్ట్
ఎన్నికల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం, చింతూరు డివిజన్‌లో కొన్ని రోజులుగా సారా బట్టీలు, దుకాణాలపై దాడి చేసి 115 కేసుల్లో 88 మందిని అరెస్ట్ చేశామని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ ఇంద్రజిత్ గురువారం వెల్లడించారు. రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, Y.రామవరం, దేవీపట్నం, మారేడుమిల్లి మం.ల్లో ఈ దాడులు చేశామన్నారు. సారా బట్టీలు, సారా అమ్మకాలపై తగు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News November 19, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు
> ఖమ్మంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయనున్న మేయర్ నీరజ > ఇల్లందులో సిపిఎం పార్టీ మండల మహాసభ > దుమ్ముగూడెంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ > పాల్వంచలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహం ఆవిష్కరణ > ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు > పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయంలో షాపుల నిర్వహణకు బహిరంగ వేలం > భద్రాచలంలో ప్రత్యేక పూజలు
News November 19, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెరిగిన చలి తీవ్రత
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజురోజుకి చలి తీవ్రత ఎక్కువ అవుతుంది. చలి ప్రభావంతో ఉదయం 8 గంటల వరకు బయటికి రావాలంటే ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, ముఖ్యంగా శ్వాసకోశ బాధితులు జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
News November 19, 2024
మాజీ ఎమ్మెల్యేలు తాటి వర్సెస్ రేగా
మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, రేగా కాంతారావులపై ఆదివారం <<14642752>>కామెంట్స్ <<>>చేసిన విషయం తెలిసిందే. దీనిపై రేగా కాంతారావు స్పందిస్తూ పార్టీలో ఉండటం ఇష్టం లేనివారు పార్టీ పైన ఏదో ఒక నింద మోపి బయటకు వెళ్తారన్నారు. తాటి వెంకటేశ్వర్లు చేసిన కామెంట్స్ వల్ల ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు. తన మనసులో అంతరంగికరమైన వేరే ఆలోచన ఉంచుకొని మాట్లాడారన్నారు