News March 19, 2024
KMM:రైలు కింద పడి యువకుడి బలవన్మరణం

చింతకాని మండలం అనంతసాగర్ సమీపంలో మల్లెల కుటుంబరావు (30) అనే వ్యక్తి సోమవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంకు చెందిన కుటుంబరావు కొంతకాలంగా అత్తగారి ఊరైన అనంతసాగర్లో నివసిస్తున్నాడు. సోమవారం ఓ ఎక్స్ ప్రెస్ రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్సై పారుపల్లి భాస్కర్ రావు తెలిపారు.
Similar News
News April 8, 2025
విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ అందించాలి: జిల్లా కలెక్టర్

ఖమ్మం: 8వ తరగతి నుంచి విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ అందించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ లైబ్రరీ, రీడింగ్ రూమ్స్, మా పాప- మా ఇంటి మణిదీపం, సన్న బియ్యం, తదితర వాటిపై జిల్లా అధికారులతో సమీక్షించారు. గ్రామాలలో రీడింగ్ రూమ్స్ ఏర్పాటు, వాటి నిర్వహణకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
News April 8, 2025
ఖమ్మంలో ఈ నెల 9న జాబ్ మేళా…!

ఖమ్మం టేకులపల్లి ప్రభుత్వ ఐటిఐ మోడల్ కెరీర్ సెంటర్ నందు ఈ నెల 9న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మాధవి తెలిపారు. ప్రైవేట్ రంగం అపోలో ఫార్మసీలో ఖాళీగా ఉన్న 100 ఉద్యోగాల ఖాళీల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 18-35 ఏళ్ళు కలిగి డీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, బీ ఫార్మసీ, పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని అన్నారు. ఉ.10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
News April 7, 2025
ప్రతి శుక్రవారం ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష: కలెక్టర్

ఖమ్మం: ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఇక నుంచి ప్రతి శుక్రవారం ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష ఉంటుందని పేర్కొన్నారు.