News February 4, 2025
KMR: అంతర్జాతీయ కరాటే పోటీలకు ఎంపిక

దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన వడ్ల భాను అండర్-14 జాతీయ కరాటే పోటీల్లో బంగారు పతకం సాధించాడు. తమిళనాడు రాష్ట్రంలో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి శ్రీలంకలో జరిగే అంతర్జాతీయ కరాటే పోటీలకు ఎంపికైనట్లు మాస్టర్ కామిండ్ల రాజయ్య చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని గ్రామస్థులు అభినందించారు.
Similar News
News December 10, 2025
విజయవాడ: ప్రత్యేక రవాణా, పార్కింగ్ ఏర్పాట్లు.!

భవాని దీక్షల విరమణ సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చే దీక్షాదారులు, భక్తుల సౌకర్యార్థం పున్నమి ఘాట్, టీటీడీ స్థలం, బీఆర్టీఎస్ రోడ్డు పరిసరాల్లో వాహన పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి దేవస్థానానికి భక్తులను వాహనాల ద్వారా తరలిస్తారు. వృద్ధులు, దివ్యాంగులు, విభిన్న ప్రతిభావంతులు కొండపైకి తీసుకు వెళ్లేందుకు ప్రత్యేక వాహనాలు సిద్ధం చేశారు.
News December 10, 2025
విజయవాడ: స్నాన ఘాట్లు, కేశఖండనశాలల ఏర్పాటు

దీక్షల విరమణకు విజయవాడ వచ్చే భక్తుల సౌకర్యార్థం స్నాన ఘాట్ల వద్ద విస్తృత ఏర్పాట్లు చేశారు. సీతమ్మవారి పాదాల వద్ద 600, భవానీ ఘాట్ వద్ద 100, పున్నమి ఘాట్ వద్ద 100 మొత్తం 800 షవర్లు ఏర్పాటు చేశారు. అలాగే మహిళలు బట్టలు మార్చుకునేందుకు సీతమ్మవారి పాదాల వద్ద 10, పున్నమి ఘాట్ వద్ద 2, భవానీ ఘాట్ వద్ద 2 గదులు సిద్ధం చేశారు. కేశఖండన కోసం మొత్తం 850 మంది నాయి బ్రాహ్మణులను వినియోగిస్తున్నారు.
News December 10, 2025
విజయవాడ: చిన్నారులకు కిడ్స్ ట్రాకింగ్ బ్యాండ్లు

భవానీ దీక్షల విరమణ కార్యక్రమం కోసం భక్తుల భద్రత నిమిత్తం 4వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. చిన్న పిల్లల భద్రత కోసం ప్రత్యేకంగా కిడ్స్ ట్రాకింగ్ రిస్ట్ బ్యాండ్లను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 270 సీసీ కెమెరాలకు అదనంగా 50 కెమెరాలను జోడించి, మొత్తం 320 సీసీ కెమెరాల పర్యవేక్షణలో భద్రతను పటిష్ఠం చేశారు.


