News February 4, 2025
KMR: అంతర్జాతీయ కరాటే పోటీలకు ఎంపిక

దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన వడ్ల భాను అండర్-14 జాతీయ కరాటే పోటీల్లో బంగారు పతకం సాధించాడు. తమిళనాడు రాష్ట్రంలో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి శ్రీలంకలో జరిగే అంతర్జాతీయ కరాటే పోటీలకు ఎంపికైనట్లు మాస్టర్ కామిండ్ల రాజయ్య చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని గ్రామస్థులు అభినందించారు.
Similar News
News January 22, 2026
నల్గొండ జిల్లాలోనూ భూభారతి కుంభకోణం..!

నల్గొండ జిల్లాలోనూ భూభారతి కుంభకోణం వెలుగు చూసింది. జిల్లాలోని చిట్యాలలో ఆరు, గట్టుపల్ లో మూడు, నాంపల్లిలో ఒకటి, చండూరులో ఒకటి చొప్పున రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరిగినట్లు నల్గొండ జిల్లా రెవెన్యూ అధికారులు గుర్తించారు. దాదాపు 11 రిజిస్ట్రేషన్లలో సుమారు నాలుగు లక్షల మేర కొల్లగొట్టినట్లు తెలుస్తుంది. వాటిపై నివేదికలను రూపొందించి సీసీఎల్ఏకు పంపించినట్లు సమాచారం.
News January 22, 2026
NRPT: నేడు డయల్ యువర్ డీఎం: లావణ్య

నారాయణపేట, కోస్గి ఆర్టీసీ డిపో పరిధిలోని ప్రయాణికులు తమ సమస్యలు, సలహాలు, సూచనలను స్వీకరించేందుకు గాను నేటి గురువారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. ప్రయాణికులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 7382826293 నంబర్‌కు ఫోన్ చేసి సద్వినియోగం చేసుకోగలరని కోరారు. మరి మీ గ్రామాలకు ఆర్టీసీ అధికారులు బస్సులను నడుపుతున్నారా లేదా కామెంట్ చేయండి.
News January 22, 2026
విజయనగరం జిల్లాలో కానిస్టేబుల్ మృతి

గజపతినగరం మండలం ముచ్చెర్ల వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన సివిల్ కానిస్టేబుల్ టి.తిరుపతిరావు కన్నుమూశారు. జనవరి 14న విధులు ముగించుకొని వస్తుండగా ప్రమాదం జరగ్గా.. విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసు శాఖలో విషాదం నెలకొంది. ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


