News April 12, 2025

KMR: అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా అరెస్ట్..!

image

అంతర్రాష్ట్ర దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. KMR ఎస్పీ రాజేష్ చంద్ర శుక్రవారం మీడియాతో తెలిపిన వివరాలిలా.. గత కొన్ని నెలలుగా కామారెడ్డి హైవే 44 పై ఆగి ఉన్న వాహనాలపై దాడి చేసి విలువైన వస్తువులను దోచుకెళ్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి 7 గురిని పట్టుకున్నామన్నారు. వారి నుంచి మరణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని SP తెలిపారు.

Similar News

News October 29, 2025

కురవని కృత్రిమ వర్షం.. క్లౌడ్ సీడింగ్ వాయిదా!

image

కృత్రిమ వర్షంతో కాలుష్యాన్ని నియంత్రించాలన్న ఢిల్లీ ప్రభుత్వ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలివ్వలేదు. మేఘాల్లో తేమ తక్కువగా ఉండటంతో క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ సక్సెస్ కాలేదు. దీంతో ఈ రోజు నిర్వహించాల్సిన సీడింగ్‌ను వాయిదా వేశారు. మేఘాల్లో తేమ ఎక్కువగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి మంజీందర్ సిర్సా తెలిపారు. కాగా మొత్తంగా ₹3.2 కోట్ల ఖర్చుతో 5సార్లు ట్రయల్స్ నిర్వహించాలని ప్లాన్ చేశారు.

News October 29, 2025

GWL: సీడ్ పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

image

గద్వాల జిల్లాలోని సీడ్ పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని అఖిలపక్ష కమిటీ నాయకులు వెంకట్రాములు, పల్లయ్య, రాజు, నరసింహ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ సంతోష్‌ను కలిసి రైతుల పక్షాన వినతిపత్రం ఇచ్చారు. భారీ వర్షాలు, అధిక కూలీలు, చీడపీడలతో పంట దిగుబడి తగ్గిందని వివరించారు. ఆర్గనైజర్లు కొనుగోలులో స్లాబ్ విధించడం, ధర తగ్గించడం వంటి ప్రకటనలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

News October 29, 2025

నల్గొండ: రేపు విద్యాసంస్థల బంద్‌కు పిలుపు

image

ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని SFI ఎంజీయూ కార్యదర్శి కర్రెం రవికుమార్ కోరారు. బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ ఎంజీయూ కమిటీ ఆధ్వర్యంలో ఉపకులపతి కాజా అల్తాఫ్ హుస్సేన్‌కు బంద్ నోటీసును అందజేశారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని.. ఈనెల 30న ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కళాశాలలు, యూనివర్సిటీలు బంద్ పాటిస్తాయని రవికుమార్ ఈ సందర్భంగా తెలిపారు.