News January 4, 2025

KMR: అదనపు కట్నం కోసం హత్య.. భర్తకు జీవిత ఖైదు

image

అదనపు కట్నం కోసం భార్యను హత్య చేసిన భర్త రమావత్ రమేశ్‌కు జీవిత ఖైదు విధిస్తూ శుక్రవారం కామారెడ్డి ప్రధాన న్యాయమూర్తి వర ప్రసాద్ తీర్పునిచ్చారు. జిల్లాలోని సురాయిపల్లి తండాకు చెందిన రమేశ్ భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తూ 2021 ఫిబ్రవరి 27న లింగంపేట్ బస్టాండ్‌లో కొట్టాడు. గాయపడినా ఆమె నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. నేరం రుజువుకావడంతో జీవిత ఖైదు విధించారు.

Similar News

News February 25, 2026

నిజామాబాద్: చెవి నొప్పికి ఆపరేషన్.. యువకుడి మృతి

image

నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల భీంగల్ మండలం పల్లికొండకు చెందిన గంగం అజయ్ మృతి చెందాడు. చెవి నొప్పితో వచ్చిన అజయ్‌కు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేస్తుండగా పరిస్థితి విషమించింది. మత్తు మందు వికటించడం వల్లే అజయ్ చనిపోయాడని, ఆసుపత్రిలో సరైన సౌకర్యం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News February 25, 2026

నిజామాబాద్: కో-ఆప్షన్ పదవులపై ఆశావహుల కన్ను

image

మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో కార్పొరేటర్లతో సమాన హోదా కలిగిన కో-ఆప్షన్ సభ్యుల పదవుల కోసం నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్‌లో ఐదుగురికి, మున్సిపాలిటీల్లో నలుగురికి ఈ అవకాశం ఉండనుంది. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 ప్రకారం 45 రోజుల్లోనే ఈ పదవులను భర్తీ చేయాల్సి ఉంటుంది. త్వరలో నోటిఫికేషన్ వెలువడనుండటంతో ఆశావహులు ముఖ్యనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

News February 25, 2026

నిజామాబాద్: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

image

జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 36,963 మంది విద్యార్థుల కోసం 58 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయని, 9:05 వరకు మాత్రమే అనుమతిస్తామని డీఐఈవో తెలిపారు. మాస్ కాపీయింగ్ నివారణకు 3 ఫ్లయింగ్, 8 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుంది.