News January 21, 2025

KMR: అద్దెకు ఉండి సొత్తు కాజేసిని నిందితులకు జైలు శిక్ష

image

ఇంట్లో అద్దెకు ఉండి యజమానికి మత్తు మందు ఇచ్చి సొత్తు కాజేసిన నిందితులకు జిల్లా జడ్జి వరప్రసాద్ జైలు శిక్ష, జరిమానా విధించినట్లు సోమవారం జిల్లా SP సింధు శర్మ తెలిపారు. ఎల్లారెడ్డికి చెందిన కళ్యాణి ఇంద్రమ్మ ఇంట్లో గుంటూరుకు చెందిన గుంజి వెంకటేశం, దివ్యలు అద్దెకు ఉండి, బంగారు ఆభరణాలు దొంగలించారని PSలో ఫిర్యాదు చేశారు. అప్పటి SI ఉపేందర్ రెడ్డి కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా నేరం రుజువైంది.

Similar News

News July 11, 2025

SRPT: తాటి చెట్టుపై నుంచి పడి కార్మికుడి మృతి

image

నూతనకల్ మండలం మిర్యాలలో తాటిచెట్టు పైనుంచి జారిపడి <<17026525>>గీత కార్మికుడు<<>> గురువారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన అనంతుల లింగయ్య (50) రోజు మాదిరిగా కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లింగయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

News July 11, 2025

HYD: AI డేటా సైన్స్ సాప్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణ

image

కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ కోర్సుల్లో శిక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మణికొండలోని అకాడమి డైరెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు. వందకుపైగా కంప్యూటర్ సాప్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం అన్నారు. యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News July 11, 2025

GNT: నేడు విచారణకు హాజరు కానున్న అంబటి

image

వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు శుక్రవారం విచారణ నిమిత్తం సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌కు హాజరు కానున్నారు. వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సమయంలో అంబటిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసు విచారణ కోసం నేడు అంబటి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు.