News February 5, 2025
KMR: అధికారులకు కలెక్టర్ సూచనలు

నులిపురుగుల నివారణ మాత్రను ప్రతి ఒక్కరికీ అందించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఫిబ్రవరి 10న నులిపురుగుల నివారణ మాత్రను ఆయా పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో అందించాలని అధికారులకు సూచించారు. ప్రతి పాఠశాల, కళాశాలల్లో ఒక నోడల్ అధికారిని నియమించాలన్నారు.
Similar News
News October 14, 2025
నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు!

AP: కోస్తాంధ్ర, దక్షిణ తమిళనాడును ఆనుకొని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడినట్లు వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఇవాళ ఏలూరు, కృష్ణా, NTR, పల్నాడు, GNT జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. మిగతా జిల్లాల్లోనూ భారీ వానలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. మరో 4 రోజులు కోస్తా, రాయలసీమల్లో ఎక్కువ చోట్ల వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పింది.
News October 14, 2025
అలాంటి ఫ్రెండ్ ఒక్కరున్నా చాలు!

ఎవరికైనా ఫ్రెండ్స్ అంటే చాలామందే ఉంటారు. కానీ, బెస్ట్ ఫ్రెండ్ అనగానే ఒక్కరిద్దరు మాత్రమే ఉంటారు. మీరు నవ్వితే వాళ్లు నవ్వుతారు, మీరు ఏడిస్తే ఓదారుస్తారు, మీరు గెలిస్తే వాళ్లు సెలబ్రేట్ చేసుకుంటారు, మీకు కష్టమొస్తే వాళ్లు అడ్డంగా నిలబడిపోతారు. ఎవరి లైఫ్లోనైనా అలాంటి ఫ్రెండ్ ఒక్కరున్నా చాలు. మీ జీవితంలో గెలిచారని చెప్పొచ్చు. మరి అలాంటి ట్రూ ఫ్రెండ్ మీ లైఫ్లోనూ ఉన్నారా? కామెంట్ చేయండి.
News October 14, 2025
విజయవాడలో అండర్-19 బాడ్మింటన్ జట్ల ఎంపిక

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 16న విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలోని బాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపిక నిర్వహించనున్నారు. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ వెంట పుట్టిన తేదీతో కూడిన స్టడీ సర్టిఫికెట్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకం, సీల్తో కూడిన ఎంట్రీ ఫారం తీసుకొనిరావాలన్నారు. ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని SGF అండర్-19 కార్యదర్శి రవికాంత తెలిపారు.