News November 21, 2024

KMR: అధికారులతో కలెక్టర్ వీడియో సమీక్ష

image

కులగణన సర్వేను రెండు, మూడు రోజుల్లో పూర్తి చేసి, డేటా ఎంట్రీ ప్రారంభించారని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు సూచించారు. గురువారం MPDOలు, MROలు, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వే పనులు ఎన్యుమరేషన్ బ్లాక్ వారిగా పూర్తిచేసి డేటా నమోదు చేయాలన్నారు. ఇప్పటివరకు 11 మండలాల్లో 100%, జిల్లావ్యాప్తంగా 96.3% ఎన్యుమరేషన్ పూర్తయిందన్నారు.

Similar News

News December 14, 2024

కామారెడ్డి: దొంగ నోట్ల ముఠా అరెస్ట్

image

దొంగ నోట్లు తయారు చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి జిల్లా SP సింధుశర్మ తెలిపారు. హైదరాబాదులో దొంగ నోట్లను ముద్రిస్తూ బాన్సువాడ, బిచ్కుంద ప్రాంతాల్లో చలామణికి యాత్నిస్తుండగా పట్టుకున్నట్లు SP చెప్పారు. వారి నుంచి రూ.56.90 లక్షల విలువ గల నకిలీ 500 నోట్లను, ప్రింటర్, 6 సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

News December 14, 2024

నిజామాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

image

ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలికి వణుకుతున్నారు. శుక్రవారం జుక్కల్ 9.4 డిగ్రీలు, మెండోరా 10.6, కోటగిరి 10.6, బిచ్కుంద 10.7, పోతంగల్ 10.8, మేనూర్ 11.1 , గాంధారి 11.2, మాచారెడ్డి 11.4, బీర్కూర్ 11.5, పాల్వంచ 11.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. చలి పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News December 14, 2024

NZB: ఎవరైనా నిర్లక్ష్యానికి తావిస్తే సస్పెండ్: మంత్రి హెచ్చరిక

image

సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని, ఎవరైనా నిర్లక్ష్యానికి తావిస్తే సస్పెండ్ చేసేందుకు వెనుకాడబోమని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందిస్తూ రైతులకు మేలు చేకూర్చాలనే లక్ష్యంతో ముందుకెళ్తోందని స్పష్టం చేశారు.