News February 18, 2025

KMR: అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి: కలెక్టర్

image

జిల్లా, మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తమ శాఖకు సంబంధించిన పనులను పర్యవేక్షించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆయన సోమవారం మాట్లాడారు. తహశీల్దార్లు LRS, ధరణి వంటి వాటిని పరిశీలించి చర్యలు చేపట్టాలన్నారు. మండల పరిషత్ అధికారులు పన్నులు, పారిశుద్ధ్యం, మొక్కల పెంపకంపై వంటి వాటిపై సమీక్షలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News March 17, 2026

సినిమా పైరసీ చేస్తే మూడేళ్ల జైలు!

image

TG: రాష్ట్రంలో సినిమా పైరసీని కట్టడి చేసేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో చర్యలు చేపడుతోంది. మూవీ పైరసీ చేస్తూ పట్టుబడితే మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించింది. రూ.3 లక్షల వరకు జరిమానా లేదా సినిమా నిర్మాణ వ్యయంలో 5% ఫైన్ తప్పదని CSB డైరెక్టర్ శిఖా గోయల్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో కలిసి సంయుక్తంగా యాంటీ పైరసీ యూనిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News March 17, 2026

MDK: 428 అంగన్వాడీలకు మహార్దశ

image

అంగన్వాడీలకు మహర్దశ రానుంది. అసౌకర్యాలకు నిలయంగా మారిన అంగన్వాడీలు బలోపేతం కానున్నాయి. తెలంగాణలో 5008 అంగన్‌వాడీలను ‘సక్షం’లో భాగంగా ఆధునికీకరించనున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా మెదక్‌లో 130, సంగారెడ్డిలో 298 అంగన్వాడీలు సక్షం సెంటర్లుగా ఎంపికయ్యాయి. ఎంపికైన కేంద్రాల్లో మెరుగైన వసతుల కల్పనతో పాటు డిజిటల్ విద్యా బోధన, LED స్క్రీన్ల ఏర్పాటు, పోషకాహారం అందనుంది.

News March 17, 2026

పెరగనున్న కార్ల ధరలు!

image

కార్ల కంపెనీలు మరోసారి షాక్ ఇవ్వనున్నాయి. తమ వెహికల్స్ ధరలు పెంచేందుకు రెడీ అవుతున్నాయి. రూపాయి పతనం, రా మెటీరియల్ ఖర్చులు ఎక్కువ కావడంతో ఇప్పటికే జనవరిలో ఓసారి పెంచాయి. తాజాగా వచ్చే నెలలో మెర్సిడెస్ బెంజ్, ఆడి 2 శాతం చొప్పున, టాటా సంస్థ 1.5 శాతం పెంచనున్నాయి. హ్యుందాయ్, మారుతీ సుజుకీ సహా మిగతా ప్రధాన సంస్థలు కూడా ధరలు సవరించాలని భావిస్తున్నాయి.