News March 11, 2025

KMR: అనధికార లే అవుట్ల క్రమబద్దీకరణకు ఛాన్స్: కలెక్టర్

image

అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఈ నెల 31వ తేదీలోగా చేసుకుంటే 25 శాతం రాయితీ ఇస్తుందని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వెల్లడించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, లేఅవుట్ యజమానులతో సోమవారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ, వక్స్ బోర్డు, ఎండోమెంట్, శిఖం తదితర భూములకు ఈ అవకాశం వర్తించదని అన్నారు.

Similar News

News November 21, 2025

ప.గో: గుండెపోటు.. నడుస్తున్న రైలులోనే ప్రాణం పోయింది!

image

రాజమండ్రికి చెందిన 67 ఏళ్ల వనమా లక్ష్మి నడుస్తున్న రైలులో గుండెపోటుకు గురై మృతి చెందింది. తన కుమార్తె గృహప్రవేశం నిమిత్తం విజయవాడకు బయలుదేరిన ఆమెకు దారి మధ్యలో గుండెపోటు రావడంతో ఏలూరు రైల్వే స్టేషన్‌లో దించి వైద్యం అందించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై ఏలూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 21, 2025

విద్యార్థులకు ఉపశమనం.. రూ.161 కోట్ల బకాయిలు విడుదల

image

ఖమ్మం: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌ బకాయిలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించిన రూ.161 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజాభవన్లో జరిగిన సమీక్షలో ఈ మేరకు సూచించారు. ఈ నిర్ణయంతో వేలాది మంది పేద విద్యార్థులకు, కళాశాలలకు ఆర్థికంగా ఊరట లభించనుంది.

News November 21, 2025

మరికొన్ని ఎర పంటలు- ఈ పంటలకు మేలు

image

☛ క్యాబేజీలో డైమండ్ బ్యాక్ మాత్‌ను ఆవాలు పంట వేసి నివారించవచ్చు.☛ అలసందలో ఆవాలు వేసి గొంగళిపురుగు, పొద్దుతిరుగుడు వేసి కాయతొలుచు పురుగులను నివారించవచ్చు. ☛ బంతిని ఎర పంటగా వేసి, కంది పంటను ఆశించే శనగపచ్చ పురుగును అరికట్టవచ్చు. ఈ జాతికి చెందిన ఆడ పురుగులు బంతి పూలపై గుడ్లు పెడతాయి. ఆ తర్వాత లార్వాను సేకరించి నాశనం చేయొచ్చు. ☛ టమాటాలో కాయతొలుచు పురుగు ఉద్ధృతిని తగ్గించడానికి బంతిని ఎర పంటగా వేయాలి.