News February 17, 2025
KMR: అన్న బెదిరింపు.. హత్య చేసిన తమ్ముళ్లు

మేడ్చల్‌లో సంచలనం రేపిన <<15484237>>హత్య<<>> కేసు వివరాలు పోలీసులు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన ఉమేశ్(25), రాకేశ్, లక్ష్మణ్ అన్నదమ్ములు. మద్యానికి బానిసైన ఉమేశ్ వేధింపులు తాళలేక అతడిని దుబాయ్ పంపుదామని ఇంట్లో ప్లాన్ చేశారు. ఇష్టంలేని అతడు ఆ ప్లాన్ చెడగొట్టాడు. ఆదివారం ఇంట్లో ఉన్న తమ్ముళ్లను బెదిరించడంతో వాళ్లు ఎదురుతిరిగారు. ఉమేశ్ పారిపోతుండగా నడిరోడ్డుపై అతడిని దారుణంగా చంపేశారు.
Similar News
News April 15, 2026
నిజామాబాద్‌లో కఠిన నిబంధనలు: సీపీ

నిజామాబాద్ జిల్లాలో విగ్రహాల ప్రతిష్టాపన, డీజేలు, ఊరేగింపులు, డ్రోన్ల వినియోగంపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించరాదని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నిషేధం విధించినట్లు స్పష్టం చేశారు. ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News April 15, 2026
నేడు నిజామాబాద్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ రాక

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం మంత్రి నేడు మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 2:45 గంటలకు నిజామాబాద్ చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 5 గంటలకు నిజామాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బేగంపేటకు తిరుగు పయనవుతారు.
News April 15, 2026
నిజామాబాద్: అంగన్‌వాడీ.. డిజిటల్ వే

అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అత్యాధునిక స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా దాదాపు 3,250 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, వీటికి కొత్త ఫోన్లను అందజేస్తున్నారు. పాత ఫోన్ల సాంకేతిక ఇబ్బందుల వల్ల డేటా నమోదులో జాప్యం జరుగుతోందని గుర్తించిన యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. అంగన్‌వాడీ టీచర్లు కొత్త ఫోన్ల రాకతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


