News February 16, 2025
KMR: అప్పుల బాధ..ఒకే రోజు ఇద్దరి సూసైడ్..!

గాల్లో దీపాల్లా..వ్యక్తుల జీవితాలు మారిపోయాయి. క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతూ..ఆ కుటుంబాల్లో పుట్టెడు దుఃఖాన్ని మిగుల్చుతున్నారు. కామారెడ్డి జిల్లాలో శనివారం ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. ఇల్లు నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చలేక.. రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లిలో నర్సింలు సూసైడ్ చేసుకోగా..కుమార్తె పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చలేక బుడ్మి వాసి జీవన్ ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Similar News
News April 19, 2026
SRSP ఆస్తుల జప్తునకు రంగారెడ్డి కోర్టు ఆదేశాలు

SRSP కాకతీయ కాల్వ పనుల బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన నీటిపారుదల శాఖపై రంగారెడ్డి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంకటేశ్వర ఇంజినీర్స్ అండ్ కాంట్రాక్టర్స్ చేసిన రూ.16కోట్ల పనుల బిల్లుల పెండింగ్‌పై కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలు పాటించకపోవడంతో నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ కార్యాలయంలో రూ.50 లక్షల విలువైన ఫర్నిచర్, 24 ఏసీలు, 2 కార్లు జప్తు చేయాలని న్యాయమూర్తి శనివారం ఆదేశాలు జారీ చేశారు.
News April 19, 2026
నిజామాబాద్ ఏఎస్పీగా శుభం ప్రకాశ్

నిజామాబాద్ ఏఎస్పీగా శుభం ప్రకాశ్ నియమితులయ్యారు. వరంగల్ ఏసీపీగా ఉన్న శుభం ప్రకాశ్‌ను అడిషనల్ ఎస్పీగా నిజామాబాద్‌కు బదిలీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. 2022 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన స్వస్థలం మహారాష్ట్రలోని వార్ధా జిల్లా. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
News April 18, 2026
NZB: సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయాలి

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 20 నుంచి 26 వరకు నిర్వహించే సంక్షేమ వారోత్సవాలను సంబంధిత అధికారులు విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్‌లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్ సూచించారు. శనివారం వారు మాట్లాడుతూ.. సంక్షేమ శాఖల అధికారులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు వారోత్సవాలను విజయవంతం చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు.


