News January 22, 2025

KMR: అర్హత కలిగిన వారికి ఉపకరణాలు అందించాలి: కలెక్టర్

image

కామారెడ్డి KVR గార్డెన్‌లో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు అందించుటకు మంగళవారం ప్రత్యేక నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి 572 మంది దివ్యంగులు హాజరయ్యారు. కాగా ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు. అర్హత కలిగిన వారికి ఉపకరణాలు అందించాలని ఆయన సూచించారు. అనంతరం ‘భేటీ బచావో భేటీ పడావో’ ప్రారంభమై పదేళ్లయిన సందర్భంగా కలెక్టర్ సంతకం చేసి పోస్టర్లను ఆవిష్కరించారు.

Similar News

News November 28, 2025

తాటిపర్తి: పుట్టిన రోజు వేడుకలో గొడవ.. వ్యక్తి మృతి

image

తాటిపర్తిలో గురువారం రాత్రి జరిగిన వాగ్వాదం విషాదంగా మారింది. శ్రీమంతుల దయ మనుమరాలు పుట్టినరోజు వేడుకల్లో రోడ్డుపై పెట్టిన బల్లను కృష్ణవేణి అనే మహిళ అటుగా వెళ్తూ బల్లలకు తగలడంతో బల్ల పడిపోయింది. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవ మొదలైంది. ఈ వాగ్వాదం జరుగుతుండగా వెంపల సూరి బాబు (59) ఆకస్మాత్తుగా కుప్పకూలి మరణించాడు. ఈ ఘటనపై గొల్లప్రోలు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 28, 2025

వరంగల్: ప్రచారానికి వారమే గడువు!

image

పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ఫైనల్ తర్వాత ప్రచారానికి కేవలం వారం రోజులే గడువు ఉంది. మొదటి విడతలో డిసెంబరు 3న అభ్యర్థుల పేర్లు, గుర్తులను ప్రకటించిన అనంతరం 11న ఎన్నికలు జరుగుతాయి. సరిగ్గా 7 రోజుల్లోనే 3,500 మంది ఓటర్లను ప్రసన్నం చేసుకొవాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా జరిగే ఎన్నికలు కావడంతో కేవలం పార్టీ కండువాలతో, తమకు కేటాయించిన సింబల్‌ను ఓటర్లకు చెప్పాల్సి ఉంటుంది.

News November 28, 2025

వరంగల్: తమ్మీ నమస్తే.. ఇంటికొచ్చి ఓటేసి వెళ్లు!

image

ఉమ్మడి వరంగల్‌లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. అభర్థులు, ఆశావహులు గ్రామాల్లో తిరుగుతూ ‘బాబాయ్, చిన్నమ్మ.. నీ ఓటు నాకే వేయాలి’ అంటూ ఓటర్లకు దగ్గరవుతున్నారు. ఓటు బ్యాంకింగ్ పెంచుకోవడానికి ఉద్యోగం, ఉపాధి నిమిత్తం పట్టణాల బాట పట్టిన వారికి సైతం అభ్యర్థులు కాల్ చేసి ‘అన్నా, తమ్మీ నమస్తే. ఈసారి సర్పంచ్‌గా పోటీ చేస్తున్నా. ఇంటికొచ్చి ఓటేసి వెళ్లు’ అంటూ కాల్ చేసి మరీ పిలుస్తున్నారట. మీకూ కాల్ వచ్చిందా?