News January 19, 2025
KMR: అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు: కలెక్టర్

అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందజేస్తామని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ కార్డు పరిశీలనలో పేరు లేకపోతే లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగే గ్రామ సభల్లో, ఎంపీడీవో కార్యాలయాల్లోని ప్రజా సేవ కేంద్రాల్లో సంబంధిత పత్రాలు అందజేయాలని సూచించారు. ఇది నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ స్పష్టం చేశారు.
Similar News
News February 13, 2025
నెల్లూరు: ప్రణతికి డాక్టరేట్ ప్రదానం

రాజకీయలలో మహిళల పాత్ర అనే అంశంపై నెల్లూరు జిల్లాకు చెందిన ఓ.ప్రణతి కి గురువారం డాక్టరేట్ ప్రదానం చేశారు. హైదరాబాదులోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (CESS)లో ప్రొఫెసర్ బలరాములు పర్యవేక్షణలో పట్టణ మరియు స్థానిక రాజకీయలలో మహిళల పాత్ర అనే అంశంపై ప్రణతి చేసిన పరిశోధనకు డాక్టరేట్ అందించారు. ఈ సందర్భంగా సెస్ డీన్, ఆచార్యులు, ఇతర అధ్యాపక బృందం పరిశోధకురాలికి అభినందనలు తెలిపారు.
News February 13, 2025
రాష్ట్రపతి పాలనతో సంభవించే మార్పులివే

✒ రాష్ట్ర ప్రభుత్వం/మంత్రి మండలి రద్దవుతుంది.
✒ ప్రజాప్రతినిధులకు ఎలాంటి అధికారాలు ఉండవు.
✒ ప్రెసిడెంట్ ప్రతినిధిగా గవర్నర్ కార్యనిర్వహణ అధికారాలు కలిగి ఉంటారు.
✒ పాలనలో గవర్నర్‌కు సహకరించేందుకు కేంద్రం ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌లను నియమిస్తుంది.
✒ రాష్ట్రానికి అవసరమైన బిల్లులను పార్లమెంట్ రూపొందిస్తుంది. ✒ అత్యవసర సమయాల్లో పాలనకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి జారీ చేస్తారు.
News February 13, 2025
రేపు బంద్.. స్కూళ్లకు సెలవు ఉందా?

రేపు తెలంగాణ బంద్‌కు మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు పిలుపునిచ్చారు. దీంతో రేపు స్కూళ్లకు సెలవు ఉంటుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ బంద్‌కు మద్దతివ్వడంపై విద్యార్థి సంఘాలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి రేపు బంద్ తీవ్రతను బట్టి విద్యాసంస్థలు సెలవు ఇవ్వడంపై నిర్ణయం ప్రకటించనున్నాయి. మీ స్కూలుకు సెలవు ఇచ్చారా? కామెంట్ చేయండి.