News March 19, 2025

KMR: అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు: SP

image

కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. కేసు నమోదు నుంచి ఛార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని పరిశీలించి ఫైనల్ చేయాలన్నారు. అన్ని రకాల ఫిర్యాదులపై చట్ట ప్రకారం స్పందించాలన్నారు. కేసులపై ప్రత్యేక దృష్టి సారించి నేరాల నియంత్రణ చేయాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News April 22, 2025

రాజీవ్ యువ వికాసం గడువు పొడిగించాలని విజ్ఞప్తి

image

TG: రాజీవ్ యువ వికాసం పథకానికి 16 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దీనికి దరఖాస్తు గడువు ఈ నెల 14నే ముగిసింది. కాగా APR 30 వరకు పొడిగించాలని Dy.CM భట్టిని EBC నేషనల్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి కోరారు. ఈ పథకం మొదటి జాబితాలోనే తమను ఎంపిక చేయాలని మంత్రులు, MLAలను నిరుద్యోగులు కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పథకాన్ని మూడేళ్లు కొనసాగించాలని CM రేవంత్‌కు నేతలు విజ్ఞప్తి చేశారని సమాచారం.

News April 22, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!!

image

∆} ఖమ్మంలో ఎంపీ రఘురాం రెడ్డి పర్యటన ∆} ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న ఓపెన్ 10, ఇంటర్ పరీక్షలు ∆} ముదిగొండలో భూభారతిపై అవగాహన కార్యక్రమం ∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన ∆} తల్లాడలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} మధిర ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన

News April 22, 2025

తుళ్లూరు: అక్కను హత్య చేసిన తమ్ముడికి యావజ్జీవ శిక్ష

image

తుళ్లూరు మండలం కొత్తూరు గ్రామంలో 2017లో జరిగిన ఆస్తి తగాదా హత్య కేసులో సోమవారం న్యాయస్థానం శిక్ష విధించింది. అక్కను హత్య చేసి, ఆమె కూతురిపై దాడి చేసిన షేక్ నాగుల్ మీరావాలికి యావజ్జీవ శిక్షతో పాటు రూ.1000 జరిమానా, మరోసారి 307 సెక్షన్ కింద 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసు విచారణ చేసిన తుళ్లూరు మాజీ సీఐ సుధాకరరావు నేతృత్వంలోని బృందాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు.

error: Content is protected !!