News March 19, 2025
KMR: ఆత్మవిశ్వాసం ఉంటే అద్భుతాలు సాధిస్తారు: కలెక్టర్

దివ్యాంగ విద్యార్థులు ఆత్మ విశ్వాసంతో ఉంటే జీవితంలో అద్భుత ఫలితాలు సాధించవచ్చని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. సమగ్ర శిక్షా కామారెడ్డి జిల్లా, భారతీయ దివ్యాంగుల పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ శిబిరాన్ని కలెక్టర్ బుధవారం ప్రారంభించారు. జిల్లాలో గుర్తించిన 207 మంది దివ్యాంగులకు ఉపకరణాలను ఆయన పంపిణీ చేశారు.
Similar News
News November 25, 2025
BHPL జిల్లాలో మొదటి దశలో 82 పంచాయితీలకు ఎన్నికలు

భూపాలపల్లి జిల్లాలోని 4 మండలాల్లో మొదటి దశలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ ప్రకటన విడుదల చేశారు. ఘనపూర్ మండలంలో 17 పంచాయతీలు, 158 వార్డులు, కొత్తపెళ్లి గోరి మండలంలో 16 పంచాయతీలు, 128 వార్డులు, రేగొండ మండలంలో 23 పంచాయితీలు, 214 వార్డులు, మొగుళ్లపళ్లి మండలంలో 26 గ్రామ పంచాయతీలు, 212 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
News November 25, 2025
BHPL జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు

భూపాలపల్లి జిల్లాలో 12 మండలాల్లో 248 గ్రామ పంచాయతీలు, 2102 వార్డులు 2102 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. మొదటి విడుతలో 82 జీపీలు, 712 వార్డులు, 712 పోలింగ్ స్టేషన్లు, రెండవ విడుతలో 85 జీపీలు, 694 వార్డులు, 694 పీఎస్లు, మూడో విడుతలో 81 జీపీలు, 696 వార్డులు, 696 పీఎస్లకు ఎన్నికలు జరగనున్నాయి.
News November 25, 2025
ఖమ్మం: సర్పంచ్ ఎన్నికలు.. ఏ దశలో ఎన్ని జీపీలంటే..

ఖమ్మం జిల్లాలో మూడు దశల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వివరాలను జిల్లా పరిషత్ అధికారి, అదనపు జిల్లా ఎన్నికల అథారిటీ విడుదల చేశారు. మొత్తం 571 జీపీలుండగా 5,214 వార్డులున్నాయి. తొలి దశలో 192 జీపీలు, రెండో దశలో 183 జీపీలు, మూడో దశ 196 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 5,214 వార్డుల్లో పోలింగ్ నిర్వహించేందుకు అదే సంఖ్యలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.


