News July 5, 2024

KMR: ఆరు నెలల్లో 4106 కేసులు నమోదు

image

పోలీసులు నిత్యం వాహనాలు తనిఖీ చేస్తూ.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నా వాహన చోదకుల్లో మాత్రం మార్పు రావడం లేదు. కామారెడ్డి జిల్లాలో ఆరు నెలల వ్యవధిలో 4106 కేసులు నమోదయ్యాయి. వీరిలో 58 మందికి జైలు శిక్షలు విధించారు. కేసులు నమోదైన వారందరికీ జరిమానాలు విధించారు. ఇందుకు ప్రధాన కారణం ఎక్కడ పడితే అక్కడ ఇష్టారీతిన అక్రమంగా మద్యం అమ్మకాలు జరగడమే. వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Similar News

News December 19, 2025

NZB: 20న కలెక్టరేట్‌లో ‘మీ డబ్బు – మీ హక్కు’ కార్యక్రమం: కలెక్టర్

image

వివిధ కారణాల వల్ల క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల కోసం ప్రభుత్వం కల్పించిన 3 నెలల ప్రత్యేక కార్యక్రమం ‘ మీ డబ్బు- మీ హక్కు’ లో భాగంగా ఈ నెల 20న కలెక్టరేట్ లో జిల్లా స్థాయి శిబిరం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. క్లెయిమ్ చేసుకోని బ్యాంకు పొదుపులు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్స్, బీమా తదితరాలను క్లెయిమ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నామన్నారు.

News December 19, 2025

TU: డిగ్రీ విద్యార్థులకు వన్ టైమ్ ఛాన్స్ ఎగ్జామ్స్

image

టీయూ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు వన్ టైమ్ ఎగ్జామ్స్ ఛాన్స్ ఇచ్చినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. 2016 నుంచి 2020 వరకు విద్యనభ్యసించిన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ తదితర కోర్సుల విద్యార్థులు 1,2,3,4,5,6 సెమిస్టర్ పరీక్షలు రాసుకోవచ్చు అని వెల్లడించారు. జనవరి 3 లోపు ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ సందర్శించాలన్నారు.

News December 19, 2025

NZB: ఆదివారం కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు: TPCC చీఫ్

image

జాతీయ ఉపాధి హామీ చట్టం పథకంలో మహాత్మా గాంధీ పేరు ను తొలగించి వికసిత్ భారత్ జి.రామ్.జి పేరు తో కొత్త పథకాన్ని తెస్తూ BJP చేస్తున్న కుట్రలను నిరసిస్తూ AICC పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ క్యాడర్ కు పిలుపునిచ్చారు. జిల్లాలో ఆదివారం కార్యకర్తలు, నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు.