News April 10, 2025
KMR: ఆరేళ్ల పాపపై దుశ్చర్య.. నిందితుడికి ఐదేళ్లు జైలు

బాలికపై లైంగిక దాడి కేసులో షేక్ షాదుల్ కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ KMR జిల్లా అదనపు జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ తీర్పు ఇచ్చినట్లు SP రాజేష్ చంద్ర గురువారం తెలిపారు. నిజాంసాగర్ PS పరిధిలో 6 ఏళ్ల బాలికపై బుర్గూల్ వాసి షాదుల్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. విచారణ అనంతరం జిల్లా అదనపు జడ్జీ ఈ మేరకు తీర్పు వెలువరించారు.
Similar News
News February 26, 2026
37 రాజ్యసభ స్థానాలు.. నామినేషన్లు షురూ

దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. చివరి తేదీ మార్చి 5. నిర్ణీత స్థానాల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ఆయా రాష్ట్రాల అసెంబ్లీలలో మార్చి 16న 9AM నుంచి 5PM వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి ఫలితాలు వెల్లడిస్తారు. మహారాష్ట్ర-7, TN-6, బిహార్-5, బెంగాల్-5, ఒడిశా-4, అస్సాం-3, <<19214239>>TG-2<<>>, ఛత్తీస్‌గఢ్-2, హరియాణా-2, హిమాచల్-ఒక సీటుకు ఎన్నికలు జరగనున్నాయి.
News February 26, 2026
జనగామ: ‘ఆర్టీసీ సేవల్లో సమస్యలా.. రేపు ఫోన్ చేయండి’

ఆర్టీసీ బస్సు సర్వీసులపై సమస్యలు, సూచనలు స్వీకరించేందుకు శుక్రవారం జనగామ డిపోలో “డయల్ యువర్ డీఎం” కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎం ఎస్. స్వాతి తెలిపారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు 9959226050 నంబర్‌కు ఫోన్ చేసి బచ్చన్నపేట, పాలకుర్తి సహా పలు మండలాల ప్రజలు తమ ఫిర్యాదులు తెలియజేయవచ్చు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.
News February 26, 2026
GNT: గురుకుల్లాల్లో ప్రవేశాలు.. పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

AP గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా గురువారం కలెక్టరేట్‌లో పోస్టర్‌ను విడుదల చేశారు. 5వ తరగతిలో ప్రవేశానికి, 6,7, 8 తరగతులలో మిగిలి ఉన్న సీట్లలో ప్రవేశానికి, ఇంటర్మీడియట్, డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మార్చి 31 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తులు చేయవచ్చన్నారు.


