News February 4, 2025
KMR: ఆర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇవాళ ప్రజావాణికి 80 ఫిర్యాదులు అందాయని తెలిపారు. భూ సమస్యలు, రెండు పడక గదుల ఇళ్ల మంజూరు, సదరం సర్టిఫికెట్, తదితర సమస్యలపై అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు.
Similar News
News February 26, 2026
NH-365BG ప్రత్యేకతలివే..

ఖమ్మం-దేవరపల్లి మధ్య నిర్మిస్తోన్న 4 లేన్ల NH-365BGకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ హైవేపై అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కింద ప్రతి 2KMలకు ఒకటి చొప్పున 95 CCTVలు ఉంటాయి. ఈ రూట్‌లో ఎక్కడైనా ప్రమాదం జరిగితే వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుంది. రహదారి మొత్తం సోలార్ లైట్లు ఉంటాయి. 5KMకు ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. ఈ రోడ్డులో ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ ఛార్జీ చెల్లించాలి.
News February 26, 2026
నెల్లూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్‌తో ఒకరి మృతి?

నెల్లూరు జిల్లా బిట్రగుంట మండలం నాగులవరానికి చెందిన టీడీపీ నాయకుడు(47) చనిపోయారు. కావలిలో నివాసం ఉండే ఆయన వారం కిందట పొలం పనులకు వెళ్లినప్పుడు కాలికి ఏదో కుట్టినట్లు అనిపించింది. తర్వాత జ్వరం రావడంతో ఆసుపత్రికి వెళ్లారు. ఎంతకి తగ్గకపోవడంతో చెన్నైకి తీసుకెళ్లారు. ఈనెల 24వ తేదీ చనిపోయారు. స్క్రబ్ టైఫస్‌తో మరణించినట్లు డాక్టర్లు రిపోర్టు ఇచ్చారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
News February 26, 2026
ములుగు: నేటి నుంచి ఇంటర్ సెకెండియర్ పరీక్షలు

ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు జిల్లాలో 1860 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వారిలో 1632 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 228 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు. పరీక్షల నిర్వహణకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు కొనసాగనున్నాయి.


