News February 4, 2025
KMR: ఆర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇవాళ ప్రజావాణికి 80 ఫిర్యాదులు అందాయని తెలిపారు. భూ సమస్యలు, రెండు పడక గదుల ఇళ్ల మంజూరు, సదరం సర్టిఫికెట్, తదితర సమస్యలపై అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు.
Similar News
News February 13, 2025
2 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు : SP

దురాజ్ పల్లి గొల్లగట్టు జాతరకు 2వేల మంది పోలీసులతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. జాతర ప్రాంగణంలో 68 సీసీ కెమెరాలతో నిఘా ఉంచామని, సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేసి 24 గంటల నిఘా ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. దొంగతనాలు జరగకుండా ఉండేందుకు సిబ్బంది మఫ్టీలో తిరుగుతూ అనుమానితులను గుర్తించి దొంగతనాల నివారణకు కృషి చేస్తారని తెలిపారు.
News February 13, 2025
10 జీపీఏ సాధించిన వారిని విమానంలో తీసుకెళ్తా: కలెక్టర్

కేజీబీవీ విద్యార్థినులు 10వ తరగతిలో పదికి పది జీపీఏ మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె కనగల్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలతో ముఖాముఖి నిర్వహించి.. వారితో సెల్ఫీ దిగారు. పదవ తరగతిలో 10-10 జీపీఏ సాధించిన వారిని విజయవాడ, చెన్నై లాంటి పట్టణాలకు విమానంలో తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.
News February 13, 2025
కేంద్రమంత్రిని కలిసిన ఎన్టీఆర్ జిల్లా రైతులు

విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్ ప్యాకేజీ- 3కి సంబంధించిన సమస్యలను ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురు రైతులు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరితో కలిసి వారు ఢిల్లీలో గడ్కరీని కలిశారు. ప్యాకేజీ- 3లో సర్వీస్ రోడ్ కేటాయింపు తదితర అంశాలను గడ్కరీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన అధికారులతో చర్చించి ఆయా అంశాలను పరిష్కరిస్తామన్నారు.