News January 21, 2025
KMR: ఆ భూములకు రైతు భరోసా: కలెక్టర్

సాగుకు యోగ్యం ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్పష్టం చేశారు. దోమకొండ మండలం లింగుపల్లిలో మంగళవారం జరిగిన ప్రజా పాలన గ్రామ సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. భూమి లేని పేదలు జాబ్ కార్డు కలిగి ఉండి 2023-24లో కనీసం 20 రోజులైనా పని చేసిన వారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పొందవచ్చని తెలిపారు. న్యూ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
Similar News
News November 27, 2025
గద్వాల: నేరాల నియంత్రణపై దృష్టి పెట్టాలి: ఎస్పీ

నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ టి.శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. గురువారం గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి క్రైమ్ రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడారు. పెండింగ్ కేసులు, దర్యాప్తు నాణ్యతపై చర్యలు తీసుకొని ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఎస్పీ సూచించారు.
News November 27, 2025
సంగారెడ్డి: ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణకు టీంల ఏర్పాటు

రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తూ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక స్థాయిలో 8 టీంలు, ప్రాథమికోన్నత స్థాయిలో 2 టీంలు, ఉన్నత స్థాయిలో 4 టీంలు, ఉర్దూ మాధ్యమాలలో 1 టీంలను ఏర్పాటు చేశారు. వీరు పాఠశాలలో అమలవుతున్న విద్యాప్రమాణాలను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు.
News November 27, 2025
గద్వాల: తొలిరోజు 68 సర్పంచ్ నామినేషన్లు: కలెక్టర్

గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తొలిరోజు ప్రశాంతంగా జరిగినట్లు గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ తెలిపారు. గద్వాల, ధరూరు, గట్టు, కేటీ దొడ్డి మండలాల్లోని 106 జీపీలకు గాను, గురువారం 68 మంది సర్పంచ్ అభ్యర్థులు, 13 మంది వార్డు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని ఆయన వివరించారు.


