News January 21, 2025
KMR: ఆ భూములకు రైతు భరోసా: కలెక్టర్

సాగుకు యోగ్యం ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్పష్టం చేశారు. దోమకొండ మండలం లింగుపల్లిలో మంగళవారం జరిగిన ప్రజా పాలన గ్రామ సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. భూమి లేని పేదలు జాబ్ కార్డు కలిగి ఉండి 2023-24లో కనీసం 20 రోజులైనా పని చేసిన వారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పొందవచ్చని తెలిపారు. న్యూ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
Similar News
News February 18, 2025
మన్యం జిల్లాకు బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయించాలి: సీపీఎం

ఈ నెల 28న శాసనసభలో ప్రవేశపెట్టే బడ్జెట్లో మన్యం జిల్లాకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని మన్యం జిల్లా సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం కురుపాంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో జంఝావతి, అడారుగెడ్డ, పెద్దగెడ్డ, వెంగళారాయ, తోటపల్లి, గుమ్మిడిగెడ్డ, పాలగెడ్డ, కంచరుగెడ్డ, జంపరుకోట ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కోరారు. గ్రామస్థులు, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
News February 18, 2025
రాజమండ్రి: ESI ఆసుపత్రిలో సిబ్బంది సస్పెన్షన్

రాజమహేంద్రవరంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు డాక్టర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సస్పెన్షన్ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం ఆసుపత్రిలో ఆకస్మీకంగా తనిఖీలు చేపట్టారు. విధుల నిర్వహణలో బాధ్యతరహిత్యంగా వ్యవహరించడంపై మంత్రి సీరియస్ అయ్యారు. విచారణ అనంతరం ఐదుగురి డాక్టర్లను, నలుగురి సిబ్బందిని సస్పెండ్ చేశారు.
News February 18, 2025
KG టు PG విద్యలో సమూల మార్పులు: మంత్రి లోకేశ్

AP: కేజీ టు పీజీ విద్యలో సమూల మార్పులు తెస్తున్నామని, రాష్ట్ర విద్యారంగాన్ని దేశంలోనే నంబర్-1 చేయడమే లక్ష్యమని మంత్రి లోకేశ్ చెప్పారు. మూస పద్ధతులకు స్వస్తి పలికి కరిక్యులమ్ ఛేంజ్ చేస్తున్నామన్నారు. కాలేజీల నుంచి బయటకు రాగానే విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేలా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ మేరకు సులోచనాదేవి సింఘానియా స్కూల్ ట్రస్టుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు.