News February 28, 2025
KMR: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

ఇంటర్మీడియట్ పరీక్షలు సమీపిస్తున్నాయి. మార్చి 5 నుంచి షురూ కానున్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా.. ఇంటర్ మొదటి సంవత్సరం 8743, ద్వితీయ సంవత్సరం 9726 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా 38 పరీక్ష కేంద్రాలు, 38 మంది చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు 38 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్, ఆరుగురు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు.
Similar News
News November 19, 2025
ఎన్ కౌంటర్లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.
News November 19, 2025
రాజన్న ఆలయంలో ముమ్మరంగా అభివృద్ధి పనులు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. సుమారు రూ.150 కోట్ల అంచనా వ్యయంతో రాజన్న ఆలయాన్ని విస్తరించనున్న నేపథ్యంలో ఆలయంలో ఇప్పటికే ఉన్న పలు కట్టడాలను తొలగిస్తున్నారు. దక్షిణం వైపుగల కోటిలింగాలను ముందుగా తరలించి, ప్రాకారాన్ని కూల్చివేస్తున్నారు. స్వామివారి అద్దాల మండపం తొలగింపు పనులు కూడా జోరుగా జరుగుతున్నాయి.
News November 19, 2025
స్పోర్ట్స్ రౌండప్

☞ 100 టెస్టులు ఆడిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్గా ముష్ఫికర్ రహీమ్ రికార్డు
☞ పార్ట్ టైమ్ ఆల్రౌండర్లను టెస్టుల్లోకి తీసుకోవద్దు.. లేదంటే భారత్ WTC ఫైనల్కు చేరడం కష్టం: సునీల్ గవాస్కర్
☞ డెఫ్లింపిక్స్లో భారత షూటర్ ధనుష్ శ్రీకాంత్కు రెండో గోల్డ్ మెడల్.. ఇటీవల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన శ్రీకాంత్, 10m మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ గోల్డ్ గెలిచాడు


