News March 15, 2025
KMR: ఇంటర్ పరీక్షల్లో 137 మంది గైర్హాజరు

కామారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. గురువారం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ గణితం 2బీ, జంతు శాస్త్రం, చరిత్ర పరీక్ష జరిగింది. జనరల్ గ్రూప్నకు సంబంధించి 5483 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 99 మంది పరీక్షకు హాజరు కాలేదు. ఒకేషనల్ విభాగంలో 1284 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 1246 మంది పరీక్ష రాశారని కామారెడ్డి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు.
Similar News
News March 18, 2025
కృష్ణా జిల్లాలో పేర్ల మార్పు రాజకీయం

కృష్ణా జిల్లాలో పేరు మార్పుల రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జగన్ హయాంలో NTR యూనివర్సిటీని YSR యూనివర్సిటీగా మార్చగా, కూటమి ప్రభుత్వం తిరిగి NTR పేరునే పెట్టింది. ఇప్పుడు YSR తాడిగడపను తాడిగడపగా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా NTR స్వగ్రామమైన నిమ్మకూరు కృష్ణా జిల్లాలో ఉండగా దీనికి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.
News March 18, 2025
లింగపాలెం కుర్రోడికి సినిమా హీరోగా ఛాన్స్

సినిమా యాక్టర్లు అంటే పల్లెల్లో, గ్రామీణ ప్రాంతాలలో ఓ క్రేజ్ ఉంటుంది. లింగపాలెంకు చెందిన తరుణ్ సాయి హీరోగా సినిమాలో నటిస్తున్నాడు. ఈ ప్రాంత ప్రజలు ఎవరూ ఊహించిన విధంగా తరుణ్ సాయి హీరో అయ్యాడు. స్థానిక శ్రీనివాసరావు, కుమారి దంపతుల పెద్ద కుమారుడికి హీరోగా అవకాశం వచ్చింది. ఈయన హీరోగా నటించిన పెళ్లిరోజు సినిమా దాదాపు పూర్తైంది. ఏప్రిల్లో విడుదల చేయటానికి సిద్ధమవుతున్నారు.
News March 18, 2025
భువనగిరి: హాస్టళ్లలో ఫిర్యాదు బాక్స్ల ఏర్పాటుకు సిద్ధం

సంక్షేమ వసతిగృహాలు, కస్తూర్భాగాంధీ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు. అన్ని చోట్ల ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటు చేయనున్నారు. హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను రాసి విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిర్యాదుల పెట్టెలో వేయోచ్చు. కలెక్టర్ తనిఖీలకు వచ్చినప్పుడు, వారంలో ఒకసారి పెట్టెను తెరిచి అందులోని ఫిర్యాదులను చూసి పరిష్కారం చూపుతారు. కలెక్టరేట్లో ఫిర్యాదు పెట్టెలు సిద్ధంగా ఉన్నాయి.