News April 3, 2025
KMR: ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు సూచించారు. రామారెడ్డి మండలం కన్నాపూర్లో గురువారం కలెక్టర్ కొబ్బరి కాయ కొట్టి ఇంటి నిర్మాణం పనులను ప్రారంభించారు. అనంతరం పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులో ఎరువుల తయారీని పరిశీలించారు. పారిశుద్ధ్య పనులను సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News December 8, 2025
మెదక్: చెక్పోస్టును సందర్శించిన ఎన్నికల అబ్జర్వర్

మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వ్యయ, మద్యం నియంత్రణ చేయాలని ఎలక్షన్ సాధారణ అబ్జర్వర్ భారతి లక్పతి నాయక్ సూచించారు. సోమవారం మంబోజిపల్లి వద్ద చెక్పోస్టును సందర్శించారు. వాహనాల తనిఖీలు, నగదు, వస్తువుల రవాణా, అమలు చేస్తున్న నియంత్రణ చర్యలను పరిశీలించారు. చెక్పోస్టుల్లో అప్రమత్తత, సమన్వయం, సమాచార అంశాలపై పలు సూచనలు చేశారు.
News December 8, 2025
అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు: కలెక్టర్

అరకు కాఫీకి అంతర్జాతీయ మార్కెట్లో స్థిరమైన ధర, అత్యుత్తమ గుర్తింపు లభించేలా జిల్లా యంత్రాంగం పటిష్ట ప్రణాళికలు రూపొందిస్తోందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. కాఫీ రైతులు, వ్యాపారులు, ఎఫ్పీఓలు, ఎన్జీఓలతో సోమవారం కలెక్టరేట్లో సమావేశమయ్యారు. జిల్లాలో కాఫీ ట్రేడర్స్ అందరూ కలిసి ట్రేడర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తే, దానికి చట్టబద్ధత కల్పించి, దాని ద్వారా వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు.
News December 8, 2025
అనంతగిరి: ఆ రెండు గ్రామాలకు నాటు పడవలే దిక్కు

అనంతగిరి మండలం పినకోట, జీనబాడు పంచాయతీలకు చెందిన కొత్త బురగా, వలసల గరువు గ్రామాలకు రోడ్డు మంజూరు చేయాలనీ పినకోట సర్పంచ్ ఎస్.గణేష్ డిమాండ్ చేసారు. ఈ గ్రామాలకు రోడ్డు మార్గం లేనందున 3కిలోమీటర్లు నాటు పడవలో ప్రయాణించాలని అన్నారు. ఈ రెండు గ్రామాలలో సుమారు 90 ఆదివాసీ కుటుంబాలు జీవిస్తున్నారన్నారు. ఆ గ్రామాలకి వెళ్లడం కష్టతరంగా ఉందని, ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు.


