News April 5, 2025

KMR: ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు: MLC కవిత

image

నీటి నిర్వహణపై అవగాహన లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని.. ఇది కాలం తెచ్చిన కరవు కాదు.. ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువే అని ఉమ్మడి NZB జిల్లా MLC కవిత మండిపడ్డారు. ‘యాదాద్రి భువనగిరి జిల్లా టేకుల సోమారంలో పంటలకు సాగు నీరు అందక చేతికొచ్చే పంటలు ఎండిపోయాయి. పుట్టెడు దుఖంలో ఉన్న రైతులను చూస్తే గుండె బరువెక్కింది. రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్‌ను వదిలిపెట్టేది లేదని’ X వేదికగా ఆమె రాసుకొచ్చారు.

Similar News

News April 9, 2025

మహావీర్ జయంతి: రేపు ఐచ్ఛిక సెలవు

image

రేపు మహావీర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆప్షనల్ (ఐచ్ఛిక) హాలిడే ప్రకటించింది. అలాగే స్టాక్ మార్కెట్లకు సైతం హాలిడే ఉండనుంది. కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సైతం సెలవు ప్రకటించారు (ఏపీ, తెలంగాణలో లేదు). 24వ తీర్థంకరుడైన భగవాన్ మహావీర్ జన్మదినాన్ని మహావీర్ జయంతిగా జరుపుకుంటారు. ఈయన జైన మత విస్తరణకు విశేష కృషి చేశారు.

News April 9, 2025

సంగారెడ్డి: 332 మొబైల్ ఫోన్లు రికవరీ: ఎస్పీ

image

CEIR ద్వారా ఫిర్యాదు వచ్చిన 332 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో మొబైల్ ఫోన్ రికవరీ మేళా బుధవారం నిర్వహించారు. CEIR పోర్టల్ ప్రారంభమైన నాటి నుంచి 9,878 ఫిర్యాదులు రాగా 2,150 ఫోన్లను గుర్తించి బాధితులకు అందించినట్లు చెప్పారు. 15 రోజుల క్రితం ఏర్పాటు చేసిన స్పెషల్ టీం ద్వారా మూడో నెల 32 ఫోన్ లను రికవరీ చేసినట్లు పేర్కొన్నారు.

News April 9, 2025

సీతారాముల వారి కళ్యాణానికి పటిష్ట బందోబస్తు

image

ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 11న శుక్రవారం నిర్వహించనున్న సీతారాముల వారి కళ్యాణం సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. 2 వేలకు మంది పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. బందోబస్తు విధుల్లో నలుగురు అదనపు ఎస్పీలు, 25 మంది డీఎస్పీలు, 73 మంది సీఐలు, 177 మంది ఎస్ఐలు, 1700 మంది పోలీసు సిబ్బంది ఉంటారన్నారు.

error: Content is protected !!