News March 8, 2025
KMR: ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్

అంతర్రాష్ట్ర దొంగల ముఠాకి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కామారెడ్డి పట్టణ పోలీసులు తెలిపారు. మహారాష్ర్టలోని నాందేడ్ జిల్లాకు చెందిన షేక్ ఇమ్రాన్ ఇస్మాయిల్, షేక్ వాజిద్ అనే ఇద్దరు వ్యక్తులు గత మూడు సంవత్సరాలుగా కామారెడ్డిలో ఉంటూ దాదాపు 30 ఇళ్లలో తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకొన్నారు. రైల్వే స్టేషన్ ప్రాంతంలో పట్టుకున్నట్లు సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
Similar News
News January 13, 2026
ముగ్గురు ఇండియన్లను రిలీజ్ చేసిన అమెరికా!

అమెరికా స్వాధీనం చేసుకున్న రష్యా ఆయిల్ ట్యాంకర్‌లో ముగ్గురు భారతీయులు ఉండటం తెలిసిందే. ఇవాళ వారిని అధికారులు రిలీజ్ చేశారు. ముగ్గురి క్షేమ సమాచారం కోసం భారత అధికారులు USతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. భారత్ ఒత్తిడి నేపథ్యంలో వారిని విడుదల చేశారు. నార్త్ అట్లాంటిక్‌లో రష్యా జెండాతో వెళ్తున్న క్రూడాయిల్ ట్యాంకర్‌ను ఈనెల 7న US స్వాధీనం చేసుకుంది. అందులోని 28 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకుంది.
News January 13, 2026
నకిలీ బంగారం ముఠా గుట్టురట్టు.. ఆరుగురి అరెస్ట్

చిన్నమండెం మండలంలో నిర్వహించిన మెరుపు దాడిలో ఆరుగురు అంతర్రాష్ట్ర మోసగాళ్ల అరెస్టయ్యారు. రూ.3 లక్షల నగదు, ఒక కారు, 2 కేజీల నకిలీ బంగారం, 170 మిల్లీగ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయినవారిలో వీరబల్లి, తమిళనాడుకు చెందిన నిందితులు ఉన్నారు. నకిలీ బంగారం విక్రయం, ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
News January 13, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


