News March 19, 2025
KMR: ఇసుక సరఫరాకు సర్వే: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక సరఫరాకు జాయింట్ సర్వే నిర్వహించి నివేదికలు సమర్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో రెవెన్యూ, మైనింగ్, భూగర్భ జల శాఖ, నీటిపారుదల శాఖల అధికారులతో జిల్లా స్థాయి సాండ్ (ఇసుక) కమిటీ సమావేశం నిర్వహించారు.
Similar News
News March 20, 2025
HYD: ఓయూ బంద్‌కు పిలుపు

ఓయూలో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిషేధం అని అధికారులు విడుదల చేసిన సర్క్యూలర్‌పై వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవల ABVP బంద్‌కు పిలుపునివ్వగా ఎక్కడికక్కడ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు SFI, AISF, PDSU, PDSU(V)AIDSO, PSU సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఓయూ విద్యార్థుల గొంతులు నొక్కే అప్రజాస్వామిక సర్క్యూలర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
News March 20, 2025
జనాభా కంటే ఫోన్లే ఎక్కువ

తెలంగాణ జనాభా కంటే ఫోన్ల సంఖ్యే ఎక్కువగా ఉందని బడ్జెట్ ద్వారా వెల్లడైంది. రాష్ట్రంలో 4.42 కోట్ల మొబైల్స్, 15.2 లక్షల ల్యాండ్ లైన్ ఫోన్లు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో మొత్తం 1.71 కోట్ల వాహనాలు ఉన్నాయి. ఇందులో టూ వీలర్‌ల వాటా 73.52%. మిగతా కేటగిరీలో కార్లు, ఆటోలు, బస్సులు, మధ్య స్థాయి, భారీ రవాణా వాహనాలున్నాయి.
News March 20, 2025
చాగలమర్రిలో రాష్ట్రంలోనే అత్యధికం..!

నంద్యాల జిల్లాలో గత కొద్దిరోజులుగా భానుడు విలయ తాండవం ఆడుతున్నాడు. ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గణాంకాల ప్రకారం బుధవారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 42.3°C ఉష్ణోగ్రత నమోదవడం ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మార్చిలోనే 42.3°C ఉష్ణోగ్రత నమోదవుతుండటం గమనార్హం.