News February 7, 2025
KMR: ఈనెల 10న జిల్లా స్థాయి ట్రయథ్లాన్ సెలక్షన్స్

కామారెడ్డి జిల్లా స్థాయి యూత్ ట్రయథ్లాన్ సెలక్షన్స్ ఈనెల 10న నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జైపాల్ రెడ్డి, అనిల్ కుమార్ శుక్రవారం తెలిపారు. అండర్ 20, 18, 16, 14 విభాగాల్లో.. వివిధ అంశాల్లో ఈ ఎంపికలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు బర్త్ సర్టిఫికెట్ జిరాక్స్‌తో జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఉదయం 8 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు.
Similar News
News October 14, 2025
రంగారెడ్డి జిల్లాలో మద్యం టెండర్లకు స్పందన కరవు

రంగారెడ్డి జిల్లాలో మద్యం టెండర్లకు స్పందన కరవైంది. మద్యం టెండర్ల దాఖలు కోసం మరో 4 రోజులు మాత్రమే గడువు ఉన్నప్పటికీ టెండర్లు దాఖలు చేయడానికి వ్యాపారులు ఆసక్తి చూపకపోవడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా 249 మద్యం షాపులకు గాను కేవలం 1,253 మాత్రమే దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. గతంలో వైన్ షాపులకు జిల్లాలో ఎక్కడా లేనివిధంగా పోటీ ఉండేది. కానీ రియల్ ఎస్టేట్ ప్రభావం వైన్స్ టెండర్లపై పడింది.
News October 14, 2025
గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి: కలెక్టర్

ఒంగోలు పాత ZPHS సమావేశ మందిరంలో ఒంగోలు డివిజన్ పంచాయతీ కార్యదర్శులతో భౌతిక సమీక్షా సమావేశాన్ని డీపీఓ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ రాజబాబు, హాజరై పంచాయతీ కార్యదర్శులకు పారిశుద్ధ్య చర్యలపై దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, పారిశుద్ధ్యంలో ప్రకాశం జిల్లాను ముందంజలో ఉంచాలన్నారు.
News October 14, 2025
రైల్వే స్టేషన్లో చిన్నారిని విడిచిన గుర్తుతెలియని వ్యక్తులు

ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ చిన్నారిని విడిచిపెట్టి వెళ్లిపోయిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫామ్‌పై ఓ వ్యక్తికి పాపని చూడమని, టాయిలెట్‌కి వెళ్లి వస్తామని ఓ మహిళ అప్పగించి వెళ్లిపోయారు. తిరిగి ఆ వ్యక్తి రాకపోవడంతో GRP పోలీసుల సహకారంతో పలాస రైల్వే స్టేషన్లో చైల్డ్ హెల్ప్ డెస్క్‌కు చిన్నారిని అప్పగించారు.