News March 7, 2025
KMR: ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన కలెక్టర్

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని EVM గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్‌ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. MRO జనార్ధన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు సరళ తదితరులు ఉన్నారు.
Similar News
News November 15, 2025
సూర్యాపేటలో ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

దురాజ్‌పల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు, ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటన కారణంగా రహదారిపై సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. అదృష్టవశాత్తూ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చివ్వెంల పోలీసులు, రహదారి సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేసే పనిలో ఉన్నారు.
News November 15, 2025
జీఎస్టీ సంస్కరణలతో బీమా రంగం వృద్ధి: IRDAI

GST సంస్కరణలు అమలులోకి వచ్చిన తర్వాత బీమా రంగంలో వృద్ధి కనిపిస్తోందని IRDAI మెంబర్ దీపక్ సూద్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ బీమాను నిత్యవసర వస్తువుగా చూస్తోందన్నారు. బీమా పాలసీలపై జీఎస్టీని జీరో శాతానికి తీసుకురావడం ఇన్సూరెన్స్ రంగానికి కలిసొచ్చిందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా వస్తున్న నష్టాల నుంచి బయటపడేందుకు ప్రత్యేక పాలసీలు రూపొందించాలని, జీఎస్టీ ప్రయోజనాలు ప్రజలకు అందించాలని సూచించారు.
News November 15, 2025
నాగర్ కర్నూల్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

జిల్లాలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో అమ్రాబాద్ మండలం వటవర్లపల్లిలో అత్యల్పంగా 12.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వెల్దండలో 12.2, ఊర్కొండలో 12.3, కొండనాగులలో 12.4, కల్వకుర్తిలో 12.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం వేళల్లో చలి కారణంగా జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.


