News March 22, 2025

KMR: ఈ నెల 31 వరకు దరఖాస్తులక అవకాశం

image

ప్రధాని మంత్రి ఇంటర్న్ షిప్ పథకానికి దేశంలోని 500 పైచిలుకు కంపెనీల్లో ఇంటర్న్‌లుగా చేరి పని అనుభవాన్ని గడిచే అవకాశం ఈ పథకం ద్వారా యువతకు లభిస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే చివరి తేదీ ఇప్పటికే ముగిసినా కేంద్రం యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మరికొన్ని రోజుల పాటు పొడిగించింది. ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

Similar News

News April 21, 2025

ఒకేసారి APPSC, DSC పరీక్షలు.. అభ్యర్థుల్లో ఆందోళన

image

AP: మెగా డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి జులై 6 వరకు జరగనుండగా అదే సమయంలో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. దీంతో రెండింటికీ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జూన్ 16 నుంచి 26 వరకు పాలిటెక్నిక్, జూ.లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల భర్తీకి పరీక్షలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆయా తేదీల్లో మార్పు చేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు.

News April 21, 2025

ASF: తల్లి, భార్య మందలించిందని సూసైడ్

image

మద్యం తాగొద్దని తల్లి, భార్య మందలించడంతో వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వాంకిడి మండలంలో చోటు చేసుకుంది. వాంకిడి ఎస్సై ప్రశాంత్ కథనం ప్రకారం.. ఇందాని గ్రామానికి చెందిన లచ్చుంబాయి చిన్న కుమారుడు సంతోశ్ మద్యానికి బానిసయ్యాడు. తల్లి, భార్య కల్పన మందలించడంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 21, 2025

వరంగల్: మూడు జిల్లాల్లో విస్తరించిన ‘పాకాల’

image

పాకాల అభయారణ్యం అంటే ఒక్క వరంగల్ జిల్లానే అనుకుంటారు. నిజానికి పాకాల అడవి 839చ.కి.మీ విస్తీర్ణంతో వరంగల్‌తో పాటు మహబూబాబాద్, ములుగు జిల్లాలోనూ విస్తరించి ఉంది. వివిధ రకాల జంతువులు, పక్షులు, సరీసృపాలకు అనువైనదిగా ఉంది. శీతాకాలంలో విదేశీ పక్షులు సైతం ఇక్కడ సందడి చేస్తాయి. నర్సంపేటకు 9 కిలో మీటర్ల దూరంలో ఉన్న పాకాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సందర్శకులు వస్తుంటారు.

error: Content is protected !!