News January 22, 2025

KMR: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కార్మికుల పిల్లల ఉపకార వేతనాల కోసం FEB 15లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ కోటేశ్వర్లు తెలిపారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలు, కర్మాగారాలు, మోటార్ రవాణ, సహకార సంస్థలు, ఇతర ట్రస్ట్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలు, కార్మికులకు ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలు మంజూరు చేస్తారని వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులకు మేడే నాటికి ఉపకార వేతనాలను బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు.

Similar News

News October 21, 2025

ఆక్వా ఎగుమతుల్లో 60% వాటా ఏపీదే: లోకేశ్

image

AP: ప్రపంచ కొనుగోలుదారులతో రాష్ట్ర ఆక్వా ఎగుమతిదారుల అనుసంధానానికి ట్రేడ్ మిషన్, నెట్వర్కింగ్‌ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్ సీఫుడ్స్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా(SAI)ను కోరారు. కోల్డ్‌చైన్ మేనేజ్మెంటు, ప్యాకేజింగ్ రంగాల్లో ఆధునిక పరిజ్ఞానం, స్థిరమైన మత్స్యసంపద నిర్వహణకు నైపుణ్యాలు అందించాలన్నారు. ఇండియాలో ఆక్వా ఎగుమతుల్లో ఏపీ వాటా 60% పైగా ఉందని, 2024-25లో ₹66వేల కోట్ల ఎగుమతులు చేసిందని చెప్పారు.

News October 21, 2025

కృష్ణా: కుటుంబానికి దూరం.. ఒత్తిడితో ఉద్యోగం

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పనిచేస్తున్న వేలాది మంది పోలీసులు పని ఒత్తిడిలోనే రోజులు గడుపుతున్నామని వాపోతున్నారు. సరెండర్ లీవులు, ఇతర సౌకర్యాలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని, పండుగ రోజులలో సైతం కుటుంబానికి దూరంగా విధులలోనే ఉంటున్నామన్నారు. ఈ ఏడాది అయినా పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం తమ సంక్షేమం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

News October 21, 2025

రబీకి అనువైన ఆరుతడి పంటలు – ప్రయోజనాలు

image

రబీలో వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆవాలు, కుసుమలు, ఆముదం, శనగ, పెసర, మినుము, బొబ్బర్లు, కొత్తిమీర, ఉల్లి, ఆలుగడ్డ, పచ్చిమిరప, పుచ్చకాయ, కూరగాయలను ఆరుతడి పంటలుగా పండించవచ్చు. వీటి వల్ల సాగు ఖర్చు, ఎరువుల వినియోగం, చీడపీడల ఉద్ధృతి తగ్గుతుంది. తక్కువ నీటితో అధిక దిగుబడి వస్తుంది. భూసారం పెరుగుతుంది. ఇవి 80-110 రోజులలో కోతకు వస్తాయి. అందుకే తక్కువ కాలంలో, తక్కువ నీటితో, ఎక్కువ ఆరుతడి పంటలు పండించవచ్చు.