News March 29, 2025
KMR: ఉపకార వేతన దరఖాస్తు గడువు పెంపు

2024-25 విద్యా సంవత్సరానికి తాజా, రెన్యువల్ ఉపకార వేతనాలకు దరఖాస్తులకు గడువును మే 31 వరకు పొడిగించినట్లు కామారెడ్డి జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారిని రజిత శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వివిధ కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు http://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News April 3, 2025
వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

AP: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించిన కోర్టు.. విచారణను వారం రోజులు వాయిదా వేసింది. దిగువ కోర్టు బెయిల్ నిరాకరించడంతో హైకోర్టులో వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గన్నవరం TDP ఆఫీసుపై దాడి కేసులో అరెస్టైన వంశీ ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
News April 3, 2025
BSNL-JIO ఒప్పందం.. కేంద్రానికి రూ.1757కోట్ల నష్టం

JIOకు BSNL బిల్లు వేయని కారణంగా కేంద్ర ప్రభుత్వం రూ.1757.56Cr నష్టపోయిందని కాగ్ పేర్కొంది. CAG రిపోర్ట్ ప్రకారం.. 2014లో రెండు సంస్థల మధ్య మౌలిక సదుపాయాల షేరింగ్‌కు ఒప్పందం జరిగింది. 10ఏళ్లుగా JIO నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. Telecom Infrastructure Providersకు చెల్లించిన రెవెన్యూ షేర్ నుంచి లైసెన్స్ ఫీజ్ కట్ చేయకపోవడంతో BSNL రూ.38.36Cr నష్టపోయింది.
News April 3, 2025
విదేశాలపై ట్రంప్ టారిఫ్‌లు.. అమెరికన్లపై భారం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లతో ఆ దేశ ప్రజలపై భారం పడనుంది. అగ్రరాజ్యం కాఫీ గింజల నుంచి కార్ల వరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. తాజా టారిఫ్‌లతో కార్ల ధరలు సగటున 2,500 డాలర్ల వరకు పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే, USకు దుస్తులు ఎగుమతి చేస్తున్న చైనా, వియత్నాం, బంగ్లాపైనా టారిఫ్‌లు పెంచడంతో వాటి ధరలూ పెరగనున్నాయి. మద్యం, ఇంధనం, కాఫీ గింజలు, కొన్నిరకాల పండ్ల ధరలు ప్రియం కానున్నాయి.