News February 3, 2025
KMR: ఎన్నికల నిబంధనలు పాటించాలి: కలెక్టర్

MLC ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు.
Similar News
News December 12, 2025
ఐటీ హిల్స్లో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

మధురవాడ ఐటీ హిల్స్ ప్రాంగణంలో కాగ్నిజెంట్ కంపెనీ శాశ్వత భవనాల శంకుస్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఆయనకు నగర ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, గణబాబు, బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ ఎం.ఎన్ హరేంధిర ప్రసాద్ స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
News December 12, 2025
సిరిసిల్ల: అక్రమ మద్యం రవాణా, విక్రయాల ప్రత్యేక దృష్టి

గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో అక్రమ మద్యం రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 90 కేసుల్లో 1337 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు వెల్లడించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల నియమావళి పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు.
News December 12, 2025
సంగారెడ్డి: ఈ నెల 13న నవోద ప్రవేశ పరీక్ష

2026-27 సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశం కోసం ఈ నెల 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు జవహర్ నవోదయ విద్యాలయం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టిక్కెట్తో పాటు ఆధార్ కార్డును వెంట తీసుకువెళ్లాలని సూచించారు.


