News February 3, 2025

KMR: ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

image

శాసన మండలి ఎన్నికల నిర్వహణకు రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కోసం ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సిబ్బందికి సూచించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలోని గదులను అదనపు కలెక్టర్‌తో కలిసి సందర్శించారు. ఎన్నికల నియమావళి మేరకు గదులను ఏర్పాటు చేయాలని, CC కెమెరాలు, బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

Similar News

News December 14, 2025

భూపాలపల్లి: 23 ఏళ్లకే సర్పంచ్

image

జిల్లాలోని టేకుమట్ల మండలం దుబ్యాల గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ యువ అభ్యర్థి సంగి అంజలి (23) విజయం సాధించారు. ఆమె తన ప్రత్యర్థిపై 41 ఓట్ల తేడాతో గెలుపొందారు. అంజలి విజయం గ్రామ యువతలో నూతన ఉత్సాహాన్ని నింపింది. తక్కువ వయస్సులోనే ప్రజల విశ్వాసాన్ని ఆమె సంపాదించారు.

News December 14, 2025

మెస్సీకి ఎందుకంత ఫాలోయింగో తెలుసా?

image

మెస్సీ పదేళ్ల వయసులో గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ (GHD)తో బాధపడ్డారు. 4 అడుగుల కంటే ఎత్తు పెరగడని డాక్టర్లు తేల్చేశారు. ఇంజెక్షన్లకు నెలకు $900-1,000 కావడంతో అతడి కుటుంబం భరించలేకపోయింది. స్పెయిన్‌లోని FC బార్సిలోనా అతడి టాలెంట్‌ను గుర్తించి తమ అకాడమీలో జాయిన్ చేసుకోవడంతో పాటు ట్రీట్మెంట్ చేయించింది. ఆ తర్వాత స్టార్ అయిన మెస్సీ ఫౌండేషన్ స్థాపించి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. ప్రపంచకప్ కూడా గెలిచారు.

News December 14, 2025

SRD: ఆత్మహత్య చేసుకున్న సర్పంచ్ అభ్యర్థి గెలుపు

image

రాయికోడ్ మండలం పీపడ్ పల్లి గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్న రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో రాజు 8 ఓట్ల తేడాతో ప్రత్యర్థి పై విజయం సాధించారు. తాను నమ్ముకున్న వారు మోసం చేశారని ఆరోపిస్తూ వారం రోజుల క్రితం రాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మృతి చెందిన రాజు విజయం సాధించడంతో ఈ గ్రామంలో మరోసారి ఎన్నికలు నిర్వహించనున్నారు.